Organ Donation : భారతదేశం అవయవ దానం విషయంలో ఎందుకు వెనుకబడి ఉందంటే ?
భారతదేశంలో మరణించినవారి నుండి అవయవాలను సేకరించటానికి అవకాశాలు ప్రభుత్వ రంగ ఆసుపత్రులల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి రాష్ట్రం మరణించిన వారి నుండి అవయవాలను సేకరించటానికి దృష్టి సారించేందుకు ఒక నోడల్ ఆసుపత్రిని ఏర్పటు చేస్తే తద్వారా అవయవ దానం రేటును మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

organ donation
Organ Donation : అవయవ దానంలో భారతదేశం ప్రపంచంలోనే అతి తక్కువ రేటును కలిగి ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది. దక్షిణాసియాలో దాతల రేటును పెంచేందుకు గణనీయమైన మార్పులు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. అవయవ దానం విషయంలో మరణించిన అవయవ దాతల రేటు మిలియన్ జనాభాకు ఒక దాత కంటే తక్కువగా ఉంది. ఇది చాలా తక్కువ. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ మరియు స్పెయిన్ వంటి దేశాలతో పోల్చినప్పుడు, మరణించిన అవయవ దాతల రేట్లు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి, ప్రతి మిలియన్ మందికి 40 మంది దాతలు అయా దేశాల్లో ఉన్నారు.
READ ALSO : Diabetes : ఆహారం తీసుకోవటంలో చేసే తప్పులు మధుమేహానికి దారితీస్తాయా? ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారంటే?
భారతదేశంలో అవయవ మార్పిడి అవసరమయ్యే వారికి మార్పిడి కోసం అందుబాటులో ఉన్న అసలు అవయవాల సంఖ్యకు మధ్య ఇప్పటికీ భారీ అంతరం ఉంది. దీని ఫలితంగా అవయవాలు అమర్చకుని సజీవంగా ఉండాల్సిన అనేక మంది రోగులు మరణించారు.
అవయవాల సరఫరా కంటే డిమాండ్ ఎక్కువ ;
వైద్యులు , అవయవ మార్పిడి నిపుణులు అవయవ దాతల కొరతకు కారణమవుతున్న వివిధ అంశాలను గుర్తించారు. అవయవ దానం గురించి అవగాహన లేకపోవడం, చుట్టూ ఉన్న అపోహలు, మౌలిక సమస్యలతో సహా అనే సమస్యలు ఉన్నట్లు గమనించారు.
READ ALSO : Eating Disorder : పెరిగిన ఒత్తిడి మోతాదుకు మించి ఆహారం తీసుకునే రుగ్మతకు ఎలా దారి తీస్తుంది?
భారతదేశంలో అవయవ మార్పిడి అనేది ప్రధానంగా జీవించి ఉన్న దాతలు ఒక అవయవాన్నివారు జీవించి ఉన్నప్పుడే దానం చేయడానికి అంగీకరిస్తారు. యునైటెడ్ స్టేట్స్ తర్వాత భారతదేశం ప్రపంచంలో రెండవ అత్యధిక జీవన దాతల అవయవ మార్పిడిని నిర్వహిస్తోంది. దక్షిణాసియా దేశంలో కొద్ది సంఖ్యలో మాత్రమే మరణించిన దాతల నుండి సేకరించిన అవయవాల మార్పిడి జరుగుతుంది.
2019లో, భారతదేశంలో నిర్వహించిన 9,751 కిడ్నీ మార్పిడిలలో 88% , 2,590 కాలేయ మార్పిడిలలో 77% జీవించి ఉన్న దాతల నుండి సేకరించినవేనని అవయవ దానం ప్రోత్సహించే సంస్ధలు చెబుతున్నాయి. అదే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 36% కిడ్నీలు , 19% కాలేయ మార్పిడి మాత్రమే జీవించిన దాతల నుండి సేకరించిన అవయవాలతో జరిగాయి.
భారతదేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాలు దాతల రేట్లను పెంచగలవా?
రోడ్డు రవాణా గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం, భారతదేశంలోని రోడ్లపై సుమారు 1,50,000 మంది మరణిస్తున్నారు. ఇది సగటున 1,000 కంటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండగా 400 కంటే ఎక్కువ రోడ్డు మరణాలు సంభవిస్తున్నాయి.
అవయవ దానం అనేది మరణించిన దాతకు చెందిన అవయవాలైన గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్రేగులు, కళ్ళు, ఊపిరితిత్తులు మరియు ప్యాంక్రియాస్,వంటి వాటిని సేకరించి జీవించడానికి అవసరమైన మరొక వ్యక్తికి మార్పిడి చేయడం. మరణించిన వ్యక్తిని దాత అని పిలుస్తారు. వారి శరీరం నుండి సేకరించే అవయవాలతో గరిష్టంగా తొమ్మిది మంది వ్యక్తుల ప్రాణాలను కాపాడవచ్చు.
READ ALSO : Kidney Health In Summer : వేసవిలో కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమైన జీవనశైలి మార్పులు ఇవే !
అయితే ఆరోగ్య నిపుణులు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యుల బంధువులతో అవయవ దానం గురించి చర్చించటం కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. మరణించిన దాత అవయవాలను అడగడానికి కొందరు వైద్యులు ఇష్టపడరు. చనిపోయిన వారి కుటుంబసభ్యులనుండి ఎటువంటి ప్రోత్సాహం ఉండటం లేదని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలో మౌలిక సదుపాయాల సమస్యలు ;
ఎక్కువ మంది వ్యక్తులు అవయవ దాతలుగా మారడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, అన్ని ఆసుపత్రులు అవయవ మార్పిడి ప్రక్రియను నిర్వహించడానికి సన్నద్ధం కాలేదు. దేశంలోని అవయవ మార్పిడి కార్యక్రమాన్ని సమన్వయం చేసే భారత జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (NOTTO)లో కేవలం 250 ఆసుపత్రులు మాత్రమే నమోదు అయ్యాయి. ప్రతి 4.3 మిలియన్ల మందికి ఒక పూర్తిస్థాయిలో అధునిక సౌకర్యాలు కలిగిన ఆసుపత్రి ఉందని చెప్పవచ్చు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అవయవ మార్పిడి కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయి.
ఇండియన్ ట్రాన్స్‌ప్లాంట్ న్యూస్‌లెటర్‌లో ప్రచురితమైన దాని ప్రకారం భారతదేశంలో మరణించిన దాతల అవయవాల మార్పిడి విషయంలో కార్పొరేట్ ఆసుపత్రులు ముందంజలో ఉండగా, ప్రభుత్వ రంగ ఆసుపత్రులు తక్కువ సహకారం అందిస్తున్నాయి.
READ ALSO : Non-Alcoholic Fatty Liver : నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యా? ఎందుకిలా ?
భారతదేశంలో మరణించినవారి నుండి అవయవాలను సేకరించటానికి అవకాశాలు ప్రభుత్వ రంగ ఆసుపత్రులల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి రాష్ట్రం మరణించిన వారి నుండి అవయవాలను సేకరించటానికి దృష్టి సారించేందుకు ఒక నోడల్ ఆసుపత్రిని ఏర్పటు చేస్తే తద్వారా అవయవ దానం రేటును మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో మరణించి వారి నుండి అవయవాలు సేకరించటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంలో దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
2020లో ప్రపంచవ్యాప్తంగా అవయవ దానాలు దాదాపు 130,000కి చేరుకున్నాయి, అమెరికా మరియు యూరప్‌లు గ్లోబల్ కిడ్నీ మార్పిడిలో అత్యధిక నిష్పత్తిని కలిగి ఉన్నాయి. అయితే ఆఫ్రికా అవయవ మార్పిడిలో అతి తక్కువ నిష్పత్తి ఉంది. అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ముందుకొస్తున్నప్పటికీ ప్రజలు,వైద్య నిపుణులలో అవగాహన పెంచడానికి అవసరమైన అవగాహాన కార్యక్రమాలు, ప్రచారాలు అంతంత మాత్రంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO : Chicken liver : ఎముకలు, కండరాలకు మేలు చేసే…. చికెన్ లివర్
మార్చిలో భారత ప్రధాని నరేందర్ మోదీ సైతం తన మన్ కీబాత్ రేడియో ప్రసారంలో సైతం అవయవ దానం విషయంలో ముందుకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవయవదానాన్ని ప్రోత్సహిస్తూ, సరళీకృతం చేసే ఏకరూప విధానంపై తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా జాతీయ ఆరోగ్య ప్రొఫైల్ ప్రకారం, ప్రజారోగ్యంపై అతి తక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేసే దేశాలలో భారతదేశం ఒకటి. న్యూ ఢిల్లీ 2025 నాటికి దేశ GDPలో 2.5% ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. అయితే ఇది ఇప్పటికీ ప్రపంచ సగటు 6% కంటే తక్కువగా ఉంది. దేశంలో అవయవ దానం మరింత మెరుగుగా ఉండాలంటే ప్రజా చేతన్యం, వైద్యులు దాత కుటుంబాల్లో అవగాహాన కల్పించటం, అవయవదానాలకు సంబంధించి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వటం వంటి కార్యకలాపాలు కొనసాగించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.