Cold Shower: ఉదయం చన్నీటి స్నానంతో అద్భుతమైన బెనిఫిట్స్

ఉదయం లేవగానే యాక్టివ్ అవ్వడానికి వేడి టీ లేదా కాఫీ తాగుతున్నారా.. వ్యాయామం చేసి మరింత అలర్ట్‌నెస్ కోరుకుంటున్నారా.. ఇవే కాదు వీటికంటే ప్రభావవంతమైన టెక్నిక్ చన్నీటి స్నానమని చెబుతున్నారు నిపుణులు. చాలామంది దూరంగా ఉండే చన్నీటి స్నానం మనల్ని అప్రమత్తంగా, శక్తివంతంగా, జీవక్రియను మెరుగుపరిచి మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు.

Cold Shower: ఉదయం చన్నీటి స్నానంతో అద్భుతమైన బెనిఫిట్స్

Head Bath At Night

Updated On : July 24, 2022 / 10:50 PM IST

 

Cold Shower: ఉదయం లేవగానే యాక్టివ్ అవ్వడానికి వేడి టీ లేదా కాఫీ తాగుతున్నారా.. వ్యాయామం చేసి మరింత అలర్ట్‌నెస్ కోరుకుంటున్నారా.. ఇవే కాదు వీటికంటే ప్రభావవంతమైన టెక్నిక్ చన్నీటి స్నానమని చెబుతున్నారు నిపుణులు. చాలామంది దూరంగా ఉండే చన్నీటి స్నానం మనల్ని అప్రమత్తంగా, శక్తివంతంగా, జీవక్రియను మెరుగుపరిచి మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు.

మెదడును మేల్కొలపడానికి వేడి కాఫీ కంటే చల్లని నీరు ఉత్తమం. ఆరోగ్యాన్ని సంపూర్ణ గేమ్ ఛేంజర్ గా వ్యవహరించి ఉదయపు దినచర్యలో కీలక భాగమవుతాయని సైకాలజీ స్పెషలిస్ట్ అంటున్నారు. వెచ్చని స్నానం సౌకర్యవంతంగా ఉన్నా.. చల్లని నీటితో స్నానం ఆరోగ్యవంతం. రక్తప్రసరణ మెరుగుపరిచి, రోగనిరోధకశక్తి పెంపొందిస్తుంది.

Read Also: రాత్రి సమయంలో తలస్నానం చేయడమే బెటర్

* ఉదయం శక్తిని పెంచుకోవచ్చు.
* వ్యాయమాల నుంచి రికవరీ కావొచ్చు.
* జీవక్రియను పెంచుతుంది.
* మానసిక స్థితి, స్థితిస్థాపకతను మెరుగుచేస్తుంది.
* దీర్ఘకాలిక నొప్పులు, వాపులు తగ్గించి రక్తప్రసరణను సాఫీ చేస్తుంది.
* బ్రౌన్ ఫ్యాట్ పెంచుతుంది.
* ఒత్తిడి స్థాయిని తగ్గించి సంకల్ప శక్తిని పెంచుతుంది.
* హై లెవల్ యాక్టివ్‌నెస్ ఫీల్ అవ్వొచ్చు.

కనీసం 5 నిమిషాలకు మించి చేసే స్నానంతో మెదడు చురుగ్గా మారుతుంది. చన్నీటి స్నానంతో శ్వాస మేనేజ్ చేయడం, మెదడును శాంతపరచుకోవడం అలవాటవుతుంది.