COVID-19 లాంటి వైరస్‌లను తట్టుకోవడానికి ఊపిరితిత్తుల బలం పెంచుకోండిలా..

COVID-19 లాంటి వైరస్‌లను తట్టుకోవడానికి ఊపిరితిత్తుల బలం పెంచుకోండిలా..

Updated On : April 2, 2020 / 1:39 PM IST

ఆరోగ్యం పెంచుకుంటే జబ్బులకు ఎదురొడ్డి పోరాడటగలం. అసలే COVID-19ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటువంటి మహమ్మారి శరీరంపై అటాక్ చేసినప్పుడు అంతర్గతంగా తట్టుకోగల శక్తి లేకపోతే మనల్ని ఏ మందులు కాపాడలేవు. మానవ శరీర నిర్మాణంలోని అత్యంత కీలకమైనవి ఊపిరితిత్తులు. పెరుగుతున్న కాలుష్యాన్ని బట్టి వాహనాల పొగ, సిగరెట్ పొగ, డైట్ లో సమస్యలు ఊపిరితిత్తులను ఏ స్థితిలో ఉంచాయో మనం అంచనా వేయలేం. 

అటువంటప్పుడు కొవిడ్ 19 లాంటి మహమ్మారి అటాక్ చేస్తే మనం కోలుకోగలమా. అలాంటి వాటి నుంచి శరీరాన్ని సిద్ధం చేసుకోవడానికి మనం ముందుగానే అలర్ట్ అవ్వాలి. యోగా లాంటి పురాతనమైన అత్యంత ప్రభావంతమైన టెక్నిక్ వాడాలి. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ జరుగుతుంది. యోగా స్టార్ట్ చేయడానికి మనకిదే కరెక్ట్ టైం. ఇక ఊపిరితిత్తులను బలపర్చేందుకు చేయాల్సిన యోగా గురించి తెలుసుకుందాం.(ఏపీలో 143కి చేరుకున్న కరోనా కేసులు)

సేతు బంధాసనం:
బ్రిడ్జి ఆకారంలో వేసే ఆసనాన్ని సేతు బంధం అని కూడా అంటారు. ఈ భంగిమ మళ్లీ శక్తిని పుంజుకోవడానికి, కొత్త శక్తిని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది వేయాలంటే ఇలా ఫాలో అవ్వండి.

ఎలా వేయాలి:

  • వెల్లకిలా పడుకుని రెండు కాళ్లు, రెండు మోచేతులు శరీరానికి దగ్గరగా పెట్టుకోండి.
  • మామూలుగానే గాలి పీలుస్తూ.. కాళ్లను భుజాల వెడల్పుకు తీసుకురండి.
  • అరికాళ్లను నేలపై ఉంచి నడుం పైకి లేపుతూ గాలి పీలుస్తూ ఉండండి.
  • నడుంతో పాటు ఛాతీ కూడా లేస్తూ ఉండాలి. మోకాళ్లను వంచుతూ పైకి లేవడానికి ప్రయత్నించండి.
  • శరీరానికి పక్కగా ఉంచి ప్రయత్నించాలి. అలా కుదరకపోతే ఒక చేతిని ఇంకొక చేత్తో పట్టుకుని సపోర్ట్ తీసుకోండి.
  • అలాగే కొద్ది సెకన్ల పాటు ఉండాలి. చివర్లో తిరిగి యథాస్థానానికి వచ్చి ఆసనాన్ని ముగించాలి.

వచ్చే లాభాలు:
శ్వాస తీసుకోవడంలో సమస్యలను క్లియర్ చేస్తుంది. ఛాతీలో మరింత గాలి పట్టేందుకు ప్రదేశాన్ని ఖాళీ చేస్తుంది. ఒత్తిడి, ఆవేశ: నుంచి ఉపశమనం ఇస్తుంది. ఆస్తమా, అధిక రక్తపోటు ఉన్న వాళ్లకు కొవిడ్19 సృష్టించే ప్రమాదాలు ఎక్కువ. అలాంటి వారికి ముందుగా ఈ ఆసనం వేస్తే రిస్క్ వచ్చే సూచనలు తక్కువ. (కరోనా వ్యాక్సిన్.. ప్రీ క్లినికల్ టెస్టింగ్ ప్రారంభం)