Eyebrow Shape : కనుబొమ్మలు కలిసి ఉంటే అదృష్టవంతులంటారు.. నిజమేనా?

మనిషిని చూడగానే ఆకర్షించేవి కళ్లు, కనుబొమ్మలు. కొందరిలో కనుబొమ్మలు వంపుగా, దట్టంగా, కలిసిపోయి ఉంటాయి. కనుబొమ్మలను బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చునట. చదవండి.

Eyebrow Shape : కనుబొమ్మలు కలిసి ఉంటే అదృష్టవంతులంటారు.. నిజమేనా?

Eyebrow Shape

Updated On : August 4, 2023 / 1:14 PM IST

Eyebrow Shape Personality Test : ఎవరినైనా చూడగానే ముందుగా ఆకట్టుకునేవి వారి కళ్లు, కనుబొమ్మలు. కొందరికి దట్టమైన కనుబొమ్మలు, కొందరికి సన్ననివి, కొందరికి స్ట్రెయిట్ గా, కొందరిలో వంపు తిరిగిన కనుబొమ్మలు ఉంటాయి. మీ కనుబొమ్మల ఆకారం మీ వ్యక్తిత్వాన్ని చెబుతుందట. ఎలాగో తెలుసుకోండి.

Stammering facts and causes : నత్తి ఉందని ఎత్తి చూపకండి .. చెప్పేది వినడానికి సమయం ఇవ్వండి

దట్టమైన కనుబొమ్మలు ఉన్నవారు స్వేచ్చని కోరుకుంటారు. వీరు ప్రతి వస్తువులోనూ అందాన్ని చూస్తారు. ప్రజలు వీరి గురించి ఏమి అనుకుంటున్నారు అనేదాని గురించి పెద్దగా ఆలోచించరు. వారి ఇష్టాలు, అభిరుచులకు అనుగుణంగా జీవితాన్ని గడుపుతారు. ఏ విషయంలోనూ తొందరపడరు. అనవసరమైన గొడవల్లో చిక్కుకోరు. తమ విషయాలకు సంబంధించి ఆచి తూచి అడుగులు వేస్తారు. తమ భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోరు. వారి లక్ష్యాలను మధ్యలో వదిలిపెట్టరు. అనుకున్నది జరగకపోయినా విసుగు చెందరు.

 

ఇక సన్నని కనుబొమ్మలు ఉన్నవారు దేనిని అంత త్వరగా నమ్మరు. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి చాలా కష్టపడతారు. సలహాల కోసం ఇతరులపై ఆధారపడతారు. వీరు పెద్ద ధైర్యవంతులు కారు. అతిగా ఆలోచిస్తారు. ఒత్తిడికి గురవుతారు. ఇతరులు చెప్పే విషయాలను త్వరగా నమ్మేస్తారు. నిరాడంబరంగా ఉంటారు.కనుబొమ్మలు వంపు తిరిగిన వారి వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాదు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు తమ మాటలతో, తమ డ్రెస్సింగ్ స్టైల్‌తో ఇతరుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులు వీరిని గుర్తించాలని తాపత్రయపడతారు. హాస్యధోరణిలో అందరితో మాట్లాడతారు. దాంతో వీరి చుట్టూ చాలామంది చేరతారు. ఎవరినీ అంత త్వరగా జీవితంలోకి ఆహ్వానించరు. అందంగా, ఎమోషనల్‌గా కనపడతారు.

Foot shape tells personality : మీ పాదం షేప్.. మీ వ్యక్తిత్వం చెప్పేస్తుంది.. మీరు..మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చెక్ చేసుకోండి

స్ట్రెయిట్‌గా కనుబొమ్మలు ఉండేవారు చాలా లాజికల్‌గా ఉంటారు. భావోద్వేగాలను బ్యాలెన్స్‌డ్ గా ప్రదర్శిస్తారు. మీరు ఇష్టపడిన దానిని ఎంపిక చేసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. వ్యక్తిగత,వృత్తిపరమైన జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ రాణిస్తారు. వీరి లాంటి భావోద్వేగాలు ఉన్న వ్యక్తిని ఇష్టపడతారు. త్వరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం కాదు. మొండి పట్టుదల, దేనినైనా సూటిగా చెప్పగలగడం వీరి నైజం. కొందరిలో కనుబొమ్మలు కలిసి ఉంటాయి. ప్రపంచం వీరిని గురించి ఏమనుకుంటోంది అనేది వీరు అస్సలు పట్టించుకోరు. ప్రతి విషయంలో వీరిలో స్పష్టత ఉంటుంది. క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. వీరు అద్భుతమైన వస్తువుల్ని ఇష్టపడతారు. వీరు ఎంతో దయగలిగిన వ్యక్తులు. నచ్చని విషయాలపై త్వరగా బాధపడతారు. చికాకును వ్యక్తం చేశారు.

 

కనుబొమ్మల మధ్య చాలా గ్యాప్ ఉంటే వీరు ప్రేమగల వ్యక్తులుగా చెప్పబడతారు. సూటిగా ఉంటారు. త్వరగా ఇతరుల్ని నమ్మతారు. అక్కర్లేని విషయాల్లో చిక్కుకుంటారు. విపరీతమైన భావోద్వేగాలు, భయాందోళనల కారణంగా కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. సరైన ప్రణాళిక లేకపోయినా జీవితంలో ముందుకు సాగిపోతారు. ఇతరులు వీరిని చాలా విశ్వసిస్తారు.

Sitting Style: కూర్చొనే విధానంతో వ్యక్తిత్వం చెప్పేయొచ్చు