Parag Agrawal: ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను ఎలాన్ మస్క్ తొలగించడంపై మీమ్స్ వెల్లువ

ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆ సామాజిక మాధ్యమ సీఈవో పరాగ్ అగర్వాల్ ను తొలగించడంతో ట్విట్టర్ లో దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున మీమ్స్ సృష్టిస్తున్నారు. ఇటీవలే చైనా మాజీ అధ్యక్షుడు జింటావోకు కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ఇప్పుడు పరాగ్ అగర్వాల్ కు కూడా అలాంటి అవమానమే జరిగిదంటూ కొందరు మీమ్స్ పోస్ట్ చేశారు.

Parag Agrawal: ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను ఎలాన్ మస్క్ తొలగించడంపై మీమ్స్ వెల్లువ

Updated On : October 28, 2022 / 1:00 PM IST

Parag Agrawal: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆ సామాజిక మాధ్యమ సీఈవో పరాగ్ అగర్వాల్ ను తొలగించడంతో ట్విట్టర్ లో దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున మీమ్స్ సృష్టిస్తున్నారు. ఇటీవలే చైనా మాజీ అధ్యక్షుడు జింటావోకు కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ఇప్పుడు పరాగ్ అగర్వాల్ కు కూడా అలాంటి అవమానమే జరిగిదంటూ కొందరు మీమ్స్ పోస్ట్ చేశారు.

జింటావో స్థానంలో పరాగ్ అగర్వాల్ ను చూపెట్టారు. ‘ప్రైవేటు ఉద్యోగాలు మనకు సరిపడవు.. ఉద్యోగ భరోసా ఉండదు’ అంటూ మరికొందరు సెటైర్లు వేస్తూ మీమ్స్ సృష్టించారు. ‘అగర్వాల్’ అదే పేరిట స్వీట్ షాప్ పెట్టుకున్నాడంటూ మరికొందరు మీమ్స్ పోస్ట్ చేశారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనగానే అందులోని ఉద్యోగులంతా ఎగిరిపోతున్నారంటూ మరికొందరు సెటైర్లు వేశారు. మొత్తానికి ట్విట్టర్ లో పరాగ్ అగర్వాల్, ఎలాన్ మస్క్ పై విపరీతంగా మీమ్స్ వస్తున్నాయి.