Bjp Mp Candidates List : ఏపీ, తెలంగాణ బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల లిస్ట్ రెడీ..!

ఇప్పటివరకు బీజేపీ అధిష్టానం 291 మంది అభ్యర్థులను ప్రకటించింది.

Bjp Mp Candidates List : ఏపీ, తెలంగాణ బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల లిస్ట్ రెడీ..!

Bjp Mp Candidates List : బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ రాత్రి 7 గంటలకు సమావేశం కానుంది. లోక్ సభ ఎన్నికల అభ్యర్థులను సీఈసీ ఫైనల్ చేయనుంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, లక్ష్మణ్, ఇతర ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 11 రాష్ట్రాలకు చెందిన 150 లోక్ సభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ ఎంపీ అభ్యర్థులపై స్పష్టత రానుంది. ఇప్పటివరకు బీజేపీ అధిష్టానం 291 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాగా, తొలి జాబితాలో 195, రెండో జాబితాలో 72, మూడో జాబితాలో 9, నాలుగో జాబితాలో 15 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఎనౌన్స్ చేసింది. నేటి సమావేశంలో 150 లోక్ సభ స్థానాల అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది.

లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ లోక్ సభ అభ్యర్థుల 5వ జాబితాకు సంబంధించిన కసరత్తు ఇవాళ జరగబోతోంది. ఈరోజు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరగబోతోంది. 11 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ రాబోతోంది. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల ఎంపికపైనా చర్చ జరగబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే నాలుగు జాబితాల్లో 291 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. 5వ జాబితా భారీగా ఉండనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మొదటి విడతకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఇకపై అభ్యర్థుల జాబితాను త్వరగా ప్రకటించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, ప్రజా జీవితం, రాష్ట్రాల నాయకుల నుంచి వచ్చిన అభ్యర్థుల ఆశావహుల జాబితాను పరిశీలించి.. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్, రాజస్తాన్, హర్యానా, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, కేరళ, కర్నాటక రాష్ట్రాల నుంచి సుమారు 150 మంది వరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరగనుంది.

ఏపీ విషయానికి వస్తే.. పొత్తులో భాగంగా 6 లోక్ సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. ఇప్పటికే ఏపీ అభ్యర్థుల జాబితాను పార్టీ హైకమాండ్ కు అందజేశారు పురంధేశ్వరి. తెలంగాణ విషయానికి వస్తే ఖమ్మం, వరంగల్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆయా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది బీజేపీ అగ్రనాయకత్వం.

 

Also Read : ఆ ముగ్గురు టీడీపీ సీనియర్ల సీట్లపై వీడని సస్పెన్స్.. కారణం ఏంటి?