బిగ్ బాస్3 వైల్డ్ కార్డ్ ఎంట్రీ: అవకాశం ఉన్న 10మంది వీళ్లే!

  • Published By: vamsi ,Published On : August 26, 2019 / 01:37 AM IST
బిగ్ బాస్3 వైల్డ్ కార్డ్ ఎంట్రీ: అవకాశం ఉన్న 10మంది వీళ్లే!

Updated On : August 26, 2019 / 1:37 AM IST

బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్ గత రెండు సీజన్లతో పోల్చుకుంటే కాస్త నెమ్మెదిగా సాగుతుంది. కంటెస్టెంట్ల అలకలు.. కోపాలు.. గొడవలు.. బుజ్జగింపులు మధ్య నెలరోజులైతే గడిచిపోయాయి. ఇప్పటికే హౌస్ నుంచి ఐదుగురు సభ్యులు అవుట్ అయ్యారు.గతవారం హిమజ రెడ్డి, అషూ రెడ్డి, పునర్నవి ఈ ముగ్గురికీ తక్కువ ఓట్లు పడగా.. చివరకు అషూ రెడ్డి బయటకు వచ్చేశారు. ఆదివారం(25 ఆగస్ట్ 2019) ఎలిమినేషన్‌కు సంబంధించి షో ప్రసారం అయింది. అయితే ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో సెలబ్రిటీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఇప్పటికే వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహద్రి ఎలిమినేట్ కూడా అయ్యారు. అయితే ఈసారి షోలో ఇంట్రెంస్ట్ క్రియేట్ చేసే వ్యక్తిని ఎంటర్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హీరోయిన్ శ్రద్ధాదాస్, ఈషా రెబ్బా, హైపర్ ఆది, ఇంకా పలువురి పేర్లు ప్రముఖంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్న 10మంది వివరాలు చూస్తే:

1. కే.ఎ.పాల్
2. ఈషా రెబ్బా
3. మనీషా ఎర్రబత్తిని
4. హైపర్ ఆది
5. వైవా హర్ష
6. యాంకర్ రవి
7. శ్రద్ధా దాస్
8. జబర్దస్త్ వేణు
9. హెబ్బా పటేల్
10. కమల్ కామరాజు

ఈ 10మందిలో ఒకరు ఈ వారం కానీ వచ్చేవారం కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. 

10 Contestants Who Might Enter BB3 House As Wild Card Entries