18 Pages : ’18 పేజిస్’ ట్రైలర్ రిలీజ్ డేట్‌ని నిఖిల్‌కి ఉత్తరం వేసిన అనుపమ..

పాన్ ఇండియా హిట్టు తరువాత నిఖిల్ అండ్ అనుపమ జంటగా నటిస్తున్న సినిమా '18 పేజిస్'. డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. దీంతో మూవీ టీమ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ని క్రేజీగా అనౌన్స్ చేసింది.

18 Pages : ’18 పేజిస్’ ట్రైలర్ రిలీజ్ డేట్‌ని నిఖిల్‌కి ఉత్తరం వేసిన అనుపమ..

18 Pages Trailer Date Announcement

Updated On : December 15, 2022 / 1:32 PM IST

18 Pages : పాన్ ఇండియా హిట్టు తరువాత నిఖిల్ అండ్ అనుపమ జంటగా నటిస్తున్న సినిమా ’18 పేజిస్’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ కథను అందిస్తున్నాడు. ఆయన శిష్యుడు మరియు ‘కుమారి 21ఎఫ్’ డైరెక్ట్ చేసిన సూర్యప్రతాప్ పల్నాటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

18 Pages : లవ్ ఫెయిల్యూర్ బాయ్స్‌ని ఆకట్టుకునేలా.. ‘టైం ఇవ్వు పిల్ల’ సాంగ్ లిరిక్స్..

గీతా ఆర్ట్స్-2 పతాకంపై చిన్న సినిమాలను నిర్మిస్తూ వరుస విజయాలను అందుకుంటున్న బన్నీ వాసు, ‘సుకుమార్ రైటింగ్స్’ ప్రొడక్షన్‌తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మెగా నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. దీంతో మూవీ టీమ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ని క్రేజీగా అనౌన్స్ చేసింది.

ఈ అనౌన్స్‌మెంట్ తో సినిమాలోనే స్టోరీ థీమ్ ని తెలియజేసేలా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే అనుపమ ట్రైలర్ రిలీజ్ డేట్ ని ఒక ఉత్తరంలో రాసి నిఖిల్ కి అందజేసిన వీడియోని షూట్ చేసి విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ ని ఈ శనివారం విడుదల చేయనున్నట్లు ప్రటించారు. కాగా ఈ క్రేజి ప్రమోషనల్ వీడియో సినిమాపై మరెంత ఆసక్తిని పెంచుతుంది. మరి కార్తికేయ-2 తో హిట్టుని అందుకున్న ఈ జంట ఈ సినిమాతో కూడా విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.