18 Pages : లవ్ ఫెయిల్యూర్ బాయ్స్‌ని ఆకట్టుకునేలా.. ‘టైం ఇవ్వు పిల్ల’ సాంగ్ లిరిక్స్..

టాలీవుడ్ యువహీరో నిఖిల్.. కార్తికేయ-2 ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో '18పేజిస్' అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందు రానున్నాడు. ఇటీవలే ఈ మూవీ నుంచి టీజర్ మరియు ఫస్ట్ సింగల్ విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఈ సినిమాలోని..

18 Pages : లవ్ ఫెయిల్యూర్ బాయ్స్‌ని ఆకట్టుకునేలా.. ‘టైం ఇవ్వు పిల్ల’ సాంగ్ లిరిక్స్..

18 Pages second single out now

18 Pages : టాలీవుడ్ యువహీరో నిఖిల్.. కార్తికేయ-2 ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో ’18పేజిస్’ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందు రానున్నాడు. సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ 2 పథకంపై ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

Nikhil Siddharth: విడాకులకు సిద్ధమైన నిఖిల్.. ఒక్క ఫోటోతో ఇచ్చిపడేశాడు!

దర్శకుడు సుకుమార్ కథని అందిస్తుండగా, అతని శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్రాన్ని తెరకెక్కించిన సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ కు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచేసింది చిత్ర యూనిట్. ఇటీవలే ఈ మూవీ నుంచి టీజర్ మరియు ఫస్ట్ సింగల్ విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని విడుదల చేశారు మేకర్స్. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ‘టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు’ అంటూ సాగే పాటను తమిళ స్టార్ హీరో శింబు ఆలపించాడు. లవ్ ఫెయిల్యూర్ బాయ్స్‌ని ఆకట్టుకునేలా సాంగ్ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.