Nikhil Siddharth: విడాకులకు సిద్ధమైన నిఖిల్.. ఒక్క ఫోటోతో ఇచ్చిపడేశాడు!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఆయన నటించిన రీసెంట్ మూవీ కార్తికేయ-2 ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి, వసూళ్ల వర్షం కురిపించింది. అయితే తాజాగా, నిఖిల్‌కు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నిఖిల్ తన భార్య పల్లవితో విడాకులకు సిద్ధమవుతున్నట్లుగా ఫిలింనగర్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి.

Nikhil Siddharth: విడాకులకు సిద్ధమైన నిఖిల్.. ఒక్క ఫోటోతో ఇచ్చిపడేశాడు!

Nikhil Siddharth Denies Divorce Rumours

Nikhil Siddharth: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఆయన నటించిన రీసెంట్ మూవీ కార్తికేయ-2 ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి, వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో నిఖిల్ టాలీవుడ్ నుండి ఇండియావైడ్ హీరోగా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా మారాడు నిఖిల్.

Nikhil : మనకి ఆస్కార్ ఎందుకు.. నిఖిల్ సంచలన కామెంట్స్..

అయితే తాజాగా, నిఖిల్‌కు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నిఖిల్ తన భార్య పల్లవితో విడాకులకు సిద్ధమవుతున్నట్లుగా ఫిలింనగర్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. కాగా, ఈ వార్తలపై నిఖిల్ ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దీంతో ఈ వార్తలు నిజమే కాబోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో తాజాగా నిఖిల్ ఈ వార్తలపై తనదైన స్టయిల్‌లో రెస్పాన్స్ ఇచ్చాడు.

Nikhil : కార్తికేయ 2 సినిమా.. త్వరలో ఆ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్..

తన భార్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ..‘‘మనమిద్దరం కలిసున్న ప్రతిక్షణం అద్భుతమే’’ అంటూ కామెంట్ చేశాడు. గోవాలో తన భార్యతో వెకేషన్‌లో ఉన్నట్లుగా ఈ ఫోటోను చూస్తే అర్థమవుతోంది. దీంతో నిఖిల్ తన భార్యకు విడాకులు ఇస్తున్నాడనే వార్త కేవలం పుకారేనని తేలిపోయింది. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయా అని నిఖిల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)