2021 Most Searching Movies : ‘జై భీమ్’ మరో రికార్డ్.. 2021లో అత్యధికంగా వెతికిన సినిమాలు ఇవే..
2021లో జనాలు ఎక్కువగా 'జై భీమ్' సినిమా గురించి వెతికారు. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ అయి చాలా రికార్డ్స్ ని సాధించింది. ఇప్పుడు తాజాగా ఇండియాలో 2021.....

2021 Most Serching Movies (1)
2021 Most Searching Movies : 2021 చివరికి వచ్చేయడంతో ఈ ఏడాదిలో ఏం జరిగిందా అని అన్ని రంగాల్లోనూ సెర్చింగ్ లు మొదలయ్యాయి. తాజాగా సినిమాల గురించి మరో విషయం బయటకి వచ్చింది. 2021లో జనాలు ఏ సినిమా గురించి ఎక్కువగా సెర్చ్ చేసారు అనే లిస్ట్ విడుదల చేశారు గూగుల్ నుంచి. అయితే ఆ లిస్ట్ లో తెలుగు సినిమాలు ఒక్కటి కూడా లేదు.
krithi Shetty : రెండో సినిమాకే రెచ్చిపోయిన బేబమ్మ..
2021లో జనాలు ఎక్కువగా ‘జై భీమ్’ సినిమా గురించి వెతికారు. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ అయి చాలా రికార్డ్స్ ని సాధించింది. ఇప్పుడు తాజాగా ఇండియాలో 2021 లో ఎక్కువమంది వెతికిన చిత్రంగా మరో రికార్డు సాధించింది. ఈ లిస్ట్ లో ‘జై భీమ్’ సినిమా మొదటి ప్లేస్ లో నిలిచింది.
ఆ తర్వాత బాలీవుడ్ లో ఇండియన్ ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బాత్రా బయోపిక్ లో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా వచ్చిన సినిమా ‘షేర్ షా’ రెండవ స్థానంలో నిలిచింది. ఈ సినిమా కూడా డైరెక్ట్ ఓటిటిలో విడుదల అయింది.
మూడో ప్లేస్ లో సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘రాధే’ నిలిచింది.
నాలుగో స్థానంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బెల్ బాటమ్’ సినిమా నిలిచింది.
ఐదో స్థానంలో హాలీవుడ్ సూపర్ ఫిల్మ్స్ ‘ఎటర్నల్స్’ నిలిచింది. ఈ హాలీవుడ్ సినిమా ఇండియాలో కూడా మంచి కలెక్షన్స్ సాధించింది.
ఆరోస్థానంలో విజయ్ హీరోగా చేసిన తమిళ్ సినిమా ‘మాస్టర్’ నిలిచింది. తమిళ్ లో ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది.
ఏడో స్థానంలో ఇటీవల వచ్చిన అక్షయ్ కుమార్ హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా ‘సూర్యవంశీ’ సినిమా నిలిచింది.
ఎనిమిదో స్థానంలో మరో హాలీవుడ్ సినిమా ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ నిలిచింది.
ఇక తొమ్మిదో స్థానంలో మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళం సినిమా ‘దృశ్యం 2’ నిలిచింది. ఈ సినిమా తర్వాత తెలుగులో వెంకటేష్ హీరోగా అదే పేరుతో రీమేక్ అయింది.
ఆఖరి పదో స్థానంలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘బుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమా నిలిచింది. ఇది కూడా డైరెక్ట్ ఓటిటిలోనే రిలీజ్ అయింది.
Pushpa : గతంలో ఎడమ భుజానికి సర్జరీలు.. ‘పుష్ప’లో భుజం పైకి పెట్టుకుని నటించడంతో…