Prabhas-Allu Arjun : 400 కోట్లు ఆఫర్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌ సినిమాలకు 400 కోట్లు ఆఫర్ ఎందుకో తెలుసా?..

Prabhas-Allu Arjun : 400 కోట్లు ఆఫర్!

Prabhas Allu Arjun

Updated On : January 27, 2022 / 5:32 PM IST

Prabhas-Allu Arjun: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌-బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌‌ల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం ‘పుష్ప’.. డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియా మూవీగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ చిత్రంతో బాలీవుడ్‌లో బన్నీకి మరింత క్రేజ్‌ పెరిగింది.

Mouni Roy : ప్రియుణ్ణి పెళ్లాడిన ‘నాగిని’ నటి..

తెలుగు సినిమాల ఓపెనింగ్‌ కలెక్షన్లను హిందీ సినిమాలు కూడా అందుకోలేకపోతున్నాయని దానికి‘పుష్ప’ సినిమానే ఉదాహరణ అంటూ బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ ఇటీవల చెప్పారు. ‘పుష్ప’ హిందీ వెర్షన్ ఏకంగా రూ. 50 కోట్లకు పైగా లాభాలు తెచ్చి పెట్టింది. దీంతో పార్ట్ 2 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Pushpa Movie : ‘పుష్ప’ ముందు హిందీ సినిమాలు తేలిపోయాయి-కరణ్ జోహర్..

బన్నీ ‘పుష్ప’ పార్ట్ 2 నార్త్ రైట్స్‌కి ఏకంగా 400 కోట్ల రూపాయల భారీ మొత్తం ఆఫర్ చేశారట. డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి నుండి పాన్ వరల్డ్ రేంజ్‌కి చేరుకుంటున్నాడు. లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ ఓటీటీ రైట్స్‌కి కూడా (ఐదు భాషలు) అక్షరాలా 400 కోట్లు ఆఫర్ చేశారని తెలుస్తుంది.

Thank You Movie : మాస్కోలో మైనస్ 14 డిగ్రీస్‌లో చైతు-రాశీ ఖన్నా..

‘రాధే శ్యామ్’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అంటూ వస్తున్న వార్తలకు డైరెక్టర్ రాధా కృష్ణ ‘సినిమా థియేటర్లలోనే విడుదలవుతుంది’ అంటూ ఒక్క ట్వీట్‌తో చెక్ పెట్టారు. మార్చి 18న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘పుష్ప – ది రూల్’ ఈ ఏడాది క్రిస్మస్‌కి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

11:11 Telugu Movie : రానా రిలీజ్ చేసిన 11:11 మోషన్ కాన్సెప్ట్ పోస్టర్.. వీడియో వైరల్..