Chiranjeevi Birthday : మెగాస్టార్ బర్త్‌డే.. సంబరాలు షురూ..

ఆగస్ట్ 22 చిరు జన్మదినం.. అభిమానులకు పర్వదినం..

Chiranjeevi Birthday : మెగాస్టార్ బర్త్‌డే.. సంబరాలు షురూ..

50 Days To Go For Megastar Chiranjeevi Birthday

Updated On : July 3, 2021 / 1:10 PM IST

Chiranjeevi: తెలుగు చలనChiranjeevi: తెలుగు చలనచిత్ర చరిత్రలో రెండు దశాబ్దాలకు పైగా నంబర్ వన్ సింహాసనాన్ని మకుటంలేని మహరాజుగా ఏలిన మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆయన పుట్టినరోజు సంబరాలు స్టార్ట్ చేసేశారు. ఆగస్ట్ 22 చిరు జన్మదినం.. అభిమానులకు పర్వదినం..

Ram charan : ‘ఆచార్య’ తో ‘సిద్ధ’.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..

ఈ సందర్భంగా మెగాభిమానులు సోషల్ మీడియాలో అడ్వాన్స్ బర్త్‌డే ట్రెండ్ మొదలుపెట్టారు. అది కూడా 50 రోజుల ముందుగా కావడం విశేషం. 50 డేస్ టు గో అంటూ డిజైన్ చేసిన చిరు స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ట్విట్టర్‌లో #50DaysToMegastarBday హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

చిరు ప్రస్తుతం తనయుడు రామ్ చరణ్‌తో కలిసి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ చేస్తున్నారు. తర్వాత ‘లూసిఫర్’ రీమేక్‌లో యాక్ట్ చెయ్యబోతున్నారు. ఈ వయసులో కూడా ఎంతో ఎనర్జీతో వరుసగా సినిమాలు చేస్తూ తనకు తానే సాటి అని ప్రూవ్ చేస్తున్నారు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.