అపోహలు నమ్మొద్దు.. అఘోరా అదరగొడతాడు.. బోయపాటి క్లారిటీ

NBK 106లో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించనున్నట్టు దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చాడు..

  • Published By: sekhar ,Published On : May 1, 2020 / 04:28 PM IST
అపోహలు నమ్మొద్దు.. అఘోరా అదరగొడతాడు.. బోయపాటి క్లారిటీ

Updated On : May 1, 2020 / 4:28 PM IST

NBK 106లో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించనున్నట్టు దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చాడు..

నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘NBK 106’.. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా షూటింగ్ వాయిదా పడింది. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలకు మించి బోయపాటి, బాలయ్యను సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నాడని రెండు క్యారెక్టర్లలో ఒకటి అఘోరా పాత్ర అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బోయపాటి ఆ వార్తలపై స్పందించారు.

Dwaraka Creations

‘‘కొత్తదనం కోసం క్యారెక్టరైజేషన్ నుంచి కథ చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలో బాలయ్య మరింత కొత్తగా కనిపిస్తారు. అభిమానులను కనువిందు చేస్తారు. ఇక అఘోరా విషయానికి వస్తే అఘోరా టైపు క్యారెక్టర్ ఉన్నమాట వాస్తవమే. అయితే దాన్ని ఎలా డిజైన్ చేశాం, ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అనేది చాలా ముఖ్యం. కొత్తదనం కావాలంటే ఈమాత్రం ట్రై చేయాల్సిందే..’’ అంటూ బోయపాటి అన్నారు.