Vijay Devarakonda Fan Girl Moment : విజయ్ దేవరకొండకి మోకాలిపై కూర్చొని ప్రపోజ్ చేసి.. ఉంగరం తొడిగిన బెంగుళూరు అమ్మాయి..

ప్రమోషన్స్ లో భాగంగా లైగర్ టీం బెంగళూరు వెళ్లగా అక్కడ తేజు అనే ఓ అమ్మాయి విజయ్‌ను చూసి పట్టలేని ఆనందం వ్యక్తపరిచింది. తన ఫేవరెట్‌ హీరోని చూడటంతో భావోద్వేగంతో కన్నీళ్లు తెచ్చుకుంది. తను తీసుకొచ్చిన ఉంగరాన్ని మోకాలిపై కూర్చొని విజయ్‌ వేలికి తొడిగి.................

Vijay Devarakonda Fan Girl Moment : విజయ్ దేవరకొండకి మోకాలిపై కూర్చొని ప్రపోజ్ చేసి.. ఉంగరం తొడిగిన బెంగుళూరు అమ్మాయి..

vijay devarakonda

Updated On : August 23, 2022 / 10:41 AM IST

Vijay Devarakonda Fan Girl Moment :  విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇండియా అంతా తిరిగేస్తున్నారు. విజయ్ కి అమ్మాయిల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. చాలా మంది అమ్మాయిలకి విజయ్ దేవరకొండ అంటే పిచ్చి. ఇటీవల ఒక అమ్మాయి తన వీపు మీద విజయ్ ఫోటోని టాటూ వేయించుకున్న వీడియో కూడా వైరల్ అయింది. తాజాగా లైగర్ టీం బెంగుళూరు వెళ్లగా అక్కడ ఓ అమ్మాయి విజయ్ దేవరకొండకి ప్రపోజ్ చేసింది.

Allu Arjun CocaCola Ad : మేము ఆగము అంటున్న బన్నీ.. కొరియన్ గర్ల్స్ తో కలిసి కోకాకోలా యాడ్..

ప్రమోషన్స్ లో భాగంగా లైగర్ టీం బెంగళూరు వెళ్లగా అక్కడ తేజు అనే ఓ అమ్మాయి విజయ్‌ను చూసి పట్టలేని ఆనందం వ్యక్తపరిచింది. తన ఫేవరెట్‌ హీరోని చూడటంతో భావోద్వేగంతో కన్నీళ్లు తెచ్చుకుంది. తను తీసుకొచ్చిన ఉంగరాన్ని మోకాలిపై కూర్చొని విజయ్‌ వేలికి తొడిగి ప్రపోజ్ చేసింది. ప్రపోజ్ చేసి భావోద్వేగంతో ఏడ్చేసింది. దీంతో విజయ్ ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని ఓదార్చాడు. ‘లైగర్‌’ మూవీ ప్రమోషన్లు అయ్యేదాకా ఆ ఉంగరాన్ని తీయనని తనకి మాటిచ్చాడు. ఆ అమ్మాయి ఇలా ప్రపోజ్ చేసి ఉంగరం తొడగడంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.