Shambhala : కల్కి రిలీజ్ అయి మా సినిమాకు ప్లస్ అయింది.. శంబాల సినిమా గురించి ఆది ఏమన్నాడంటే..

ఆది మీడియాతో మాట్లాడుతూ శంబాల సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.(Shambhala)

Shambhala : కల్కి రిలీజ్ అయి మా సినిమాకు ప్లస్ అయింది.. శంబాల సినిమా గురించి ఆది ఏమన్నాడంటే..

Shambhala

Updated On : December 24, 2025 / 10:00 AM IST

Shambhala : ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ‘శంబాల’ సినిమా డిసెంబర్ 25 రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రీమియర్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో ఆది మీడియాతో మాట్లాడుతూ శంబాల సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.(Shambhala)

శంబాల గురించి మాట్లాడుతూ.. శంబాల సినిమా బాగా వచ్చింది. మా మూవీని అందరూ ఎంజాయ్ చేస్తారు. శంబాల ఉందా? లేదా అనేది ఎవ్వరికీ తెలీదు కానీ మన పురాణాల ప్రకారం శంబాలకి ఓ మంచి గుర్తింపు ఉంది. శంబాల అని టైటిల్ చెప్పినప్పుడే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను కానీ ఈ కథ విన్న కొన్ని రోజులకే కల్కి రిలీజ్ అయింది. ఆ తరువాత శంబాల పేరు మరింత వైరల్ అవ్వడంతో మా సినిమాకు కలిసొచ్చింది. ఈ సినిమా మొదటి స్టిల్ వదిలినప్పటి నుంచి సినిమాపై బజ్ ఉంది. ఈసారి మంచి హిట్ కొడతాను అని నమ్మకం ఉంది అన్నారు.

Also Read : Dhurandhar : ‘ధురంధర్’ సరికొత్త రికార్డ్.. ఓటీటీ రైట్స్ ఎన్ని వందలకోట్లకు అమ్ముడయిందో తెలుసా?

Shambhala

శంబాల సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, ఎదురైన సవాళ్ల గురించి చెప్తూ.. శంబాల సినిమాలో అద్భుతమైన పోరాట సన్నివేశాలున్నాయి. రాజ్ కుమార్ మాస్టర్ అన్ని యాక్షన్ సీక్వెన్స్‌కి రిహార్సల్స్ చేశారు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ అదిరిపోతుంది. షూటింగ్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సందర్భంలో గాయాలు అవుతుంటాయి. ఫైర్‌తో ఓ సీక్వెన్స్ చేసినప్పుడు చిన్న గాయాలు అయ్యాయి. పోరాట సన్నివేశాల్లో గాయాలు అనేవి కామన్. ఈ సినిమాను విపరీతమైన చలిలో నైట్ షూట్ చేశాం. క్లైమాక్స్ పార్ట్ మొత్తం నైట్ షూట్‌లోనే జరిగింది అని తెలిపారు.

అలాగే.. శంబాల సినిమాలో ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండవు. ఉన్న వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ చూసి అందరం షాక్ అయ్యాం. అంత అద్భుతంగా ఇచ్చారు. ఈ సినిమా నిర్మాతలు నా మార్కెట్ కంటే ఎక్కువగానే ఖర్చు పెట్టారు. ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున నిర్వహించారు అని తెలిపారు.

Also Read : Peddi : ఏకంగా పీఎం ఆఫీస్ లో పెద్ది షూటింగ్..? ఢిల్లీలో బుచ్చిబాబు ఏం ప్లాన్ చేశాడ్రా బాబు..

అయితే డిసెంబర్ 25 న ఎక్కువ సినిమాలు ఉన్న దానిపై స్పందిస్తూ.. ఈ డేట్‌కి చాలా కాంపిటీషన్ ఏర్పడింది. అందరికంటే ముందు మేమె డేట్ ప్రకటించాము. డిసెంబరర్ 25 డేట్‌ని వదులుకుంటే మళ్లీ ఇంత మంచి డేట్ నాకు దగ్గర్లో కనిపించలేదు. మేం సినిమా పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం. హిందీలో కూడా మా సినిమా వచ్చే వారం రిలీజ్ చేస్తున్నాము. డిసెంబర్ 25 క్రిస్మస్ మంచి సీజన్. శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్‌తో నాకు మంచి పరిచయం ఉంది. మా క్రికెట్‌ టీంలో రోషన్ చురుకుగా ఉంటాడు. రోషన్ నటించిన ఛాంపియన్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. మా సినిమాతో పాటు ఆ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.