Amaran – In the City : కార్తీ వల్లభన్.. పవర్‌ఫుల్ పోలీస్..

‘లవ్ లీ’ స్టార్ ఆది సాయికుమార్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’..

Amaran – In the City : కార్తీ వల్లభన్.. పవర్‌ఫుల్ పోలీస్..

Amaran In The City

Updated On : July 17, 2021 / 11:57 AM IST

Amaran – In the City: ‘లవ్ లీ’ స్టార్ ఆది సాయికుమార్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’. ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మాత SVR నిర్మిస్తుండగా.. సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రాని కొత్త కథా నేపథ్యంతో ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ సినిమాను రూపొందిస్తున్నారు డెబ్యూ డైరెక్టర్ ఎస్ బాలవీర్.

Amaran – In The City : ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా ‘అమరన్’..

ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కార్తీ వల్లభన్ అనే క్యారెక్టర్లో నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ నాయికగా కనిపించనుంది. రెండేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి పక్కా ప్లానింగ్‌తో షూటింగ్‌కు రెడీ అయ్యింది ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ సినిమా.

ఫస్ట్ షెడ్యూల్‌లో భారీ ఖర్చుతో నిర్మించిన పోలీస్ స్టేషన్ సెట్‌లో షూటింగ్ చేస్తున్నారు. దీంతో పాటు నగర పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. సాయి కుమార్, ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, వీర శంకర్, అయన్, శృతి, రోషన్, మధు మణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Aadi SaiKumar : ఆది సాయికుమార్ హీరోగా, సునీల్ కీ రోల్‌లో సినిమా..