Aadi Saikumar : ఆది సాయికుమార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. న్యూ ఇయర్ కానుకగా ‘టాప్ గేర్’ రిలీజ్..

2022 ఏడాది మొత్తం కూడా బాక్సాఫీస్ వద్ద సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఆది సాయి కుమార్ ట్రెండ్ కనిపించింది. వరుస ఆఫర్స్ అందుకుంటూ వైవిధ్యభరితమైన పాత్రలతో..........

Aadi Saikumar : ఆది సాయికుమార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. న్యూ ఇయర్ కానుకగా ‘టాప్ గేర్’ రిలీజ్..

Aadi Saikumar top gear movie released december 30

Updated On : December 23, 2022 / 8:57 PM IST

Aadi Saikumar : ప్రేమ కావాలి అంటూ కెమెరా ముందుకొచ్చి తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్. 2011లో ఇండస్ట్రీలో అడుగు పెట్టి వైవిధ్య భరితమైన కథలతో అలరిస్తున్నారు. రోల్ ఎలాంటిదైనా సరే అందులో లీనమవుతూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ క్లాస్, మాస్ ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు. 2011 సంవత్సరంలో ప్రేమ కావాలి సినిమాకు గాను దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నారు ఆది సాయి కుమార్.

ఇచ్చిన క్యారెక్టర్ లో ఒదిగిపోతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ఆది సాయి కుమార్.. ఇప్పటికే పలు వైవిధ్యభరితమైన రోల్స్ చేసి వెండితెరపై మ్యాజిక్ చేశారు. ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో వినోదం పంచుతూ దర్శక నిర్మాతలకు బెటర్ చాయిస్ అవుతున్నారు.

ఇక 2022 ఏడాది మొత్తం కూడా బాక్సాఫీస్ వద్ద సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఆది సాయి కుమార్ ట్రెండ్ కనిపించింది. వరుస ఆఫర్స్ అందుకుంటూ వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను థ్రిల్ చేశారాయన. టాలీవుడ్ లో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ పెంచుకున్న ఆది సాయి కుమార్ నేటితరం ఆడియన్స్ టేస్ట్ తెలిసిన హీరోగా ప్రతి సినిమాలో కూడా తన నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శించారు. దీంతో టాప్ టాలెంటెడ్ డైరెక్టర్లు సైతం ఆది సాయి కుమార్ తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

Balakrishna : నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ కృతి సనన్ ని పెట్టుకుంటాను..

ప్రస్తుతం తెలుగులో టాప్ గేర్ సినిమా చేస్తున్నారు ఆది సాయి కుమార్. కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వదిలిన అన్ని అప్‌డేట్స్ విశేష స్పందన తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. డిసెంబర్ 30న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

నేడు (డిసెంబర్ 23) ఆది సాయి కుమార్ పుట్టినరోజు కావడంతో ‘టాప్ గేర్’ టీమ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతోంది. త్వరలో మరిన్ని మంచి సినిమాలతో అలరించేందుకు ఆది సాయి కుమార్ సిద్ధమవుతున్నారు.