Aamir Khan : ఆమిర్ ఖాన్ కొత్త ప్రాజెక్ట్ లుక్ అదుర్స్.. 16ఏళ్ళ తరువాత మళ్ళీ కాంబినేషన్..

ఆమిర్ ఖాన్ కొత్త ప్రాజెక్ట్ లుక్ అదిరిపోయింది. 16ఏళ్ళ తరువాత మళ్ళీ ఆ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ..

Aamir Khan : ఆమిర్ ఖాన్ కొత్త ప్రాజెక్ట్ లుక్ అదుర్స్.. 16ఏళ్ళ తరువాత మళ్ళీ కాంబినేషన్..

Aamir Khan Reunited with Darsheel Safary after 16 years for his new project

Aamir Khan : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్.. 2022లో ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. అదే ఏడాది ‘సలాం వెంకీ’ సినిమాలో గెస్ట్ రోల్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. ఆ రెండు చిత్రాలు తరువాత యాక్టింగ్ కి కొంచెం బ్రేక్ ఇచ్చిన ఆమిర్.. ఇప్పటివరకు మరో సినిమాని అనౌన్స్ చేయలేదు. ఫ్యాన్స్ అంతా ఆమిర్ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఆమిర్ కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ ఫోటో బయటకి వచ్చింది.

ఇక ఈ ప్రాజెక్ట్ కోసం 16 ఏళ్ళ కాంబినేషన్‌ని.. ఆమిర్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. 2007లో ఆమిర్ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా ‘తారే జమీన్ పర్’. స్కూల్ ఎడ్యుకేషన్, పేరెంటింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అందరి మనసు దోచుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కథ ఎనిమిదేళ్ళ బాలుడిగా నటించిన ‘దార్శీల్ సఫారీ’, టీచర్‌గా నటించిన ‘ఆమిర్’ చుట్టూ సాగుతుంది.

Also read : Allu Arjun – Samantha : తన యాక్టింగ్ రోల్ మోడల్.. అల్లు అర్జున్ అంటున్న సమంత.. వీడియో వైరల్

టీచర్ అండ్ స్టూడెంట్ గా అందరి మనసుని దోచుకున్న ఆమిర్ అండ్ దార్శీల్.. ఇప్పుడు 16 ఏళ్ళ తరువాత కలిసి నటించబోతున్నారు. ఈ రీ యూనియన్ గురించి దార్శీల్ ఒక పోస్ట్ వేశారు. “16ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు కలిసి నటించబోతున్నాము. ఎమోషనల్ గా ఉంది ఈ మూమెంట్. దీనికి నా మెంటర్ అయిన ఆమిర్ కృతజ్ఞతలు. మరో నాలుగు రోజుల్లో బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతుంది. ఎదురు చూస్తూ ఉండండి” అంటూ రాసుకొచ్చారు.

అంతేకాదు ఒక పిక్ ని కూడా షేర్ చేశారు. ఆ పిక్ లో ‘తారే జమీన్ పర్’ మూవీలోని స్టిల్, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన పిక్ కనిపిస్తుంది. కొత్త ఫొటోలో ఆమిర్.. తెల్ల జుట్టు, గడ్డంతో సూట్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. దార్శీల్ స్టైలిష్ యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. నాలుగు రోజుల్లో ఎటువంటి అప్డేట్ రాబోతుందో అని ఆసక్తి మొదలయింది. మరి ఆ అప్డేట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Darsheel Safary (@dsafary)