Aishwarya Rai : ఐశ్వర్య గురించి కూతురు ఆరాధ్య గొప్ప మాటలు.. నువ్వు చేసేది ఒక అద్భుతం అమ్మ..
50 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఐశ్వర్య గురించి కూతురు ఆరాధ్య మాట్లాడిన గొప్ప మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Aaradhya emotional comments about Aishwarya Rai Bachchan
Aishwarya Rai : ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ నిన్నటితో (నవంబర్ 1) 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఎంతోమంది కలలు రాణిగా వారి గుండెల్లో స్థానం దక్కించుకున్న ఐశ్వర్య.. యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది అంటే నమ్మలేని విషయమే. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆమె తన అందంతో ప్రతి ఒక్కర్ని మెస్మరైజ్ చేస్తున్నారు. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి యాక్టింగ్ కెరీర్ లోకి వచ్చి ఇండియన్ స్టార్ యాక్ట్రెస్ గా ఎదిగారు. ఇక నిన్న ఆమె పుట్టినరోజు కావడంతో.. అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి విషెస్ వెల్లువెత్తాయి.
ఈ ప్రత్యేకమైన 50వ పుట్టినరోజుని ఐశ్వర్య ప్రత్యేకమైన వ్యక్తలతో సెలబ్రేట్ చేసుకున్నారు. తన తల్లి బృందా రాయ్ మరియు కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి క్యాన్సర్ రోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేక్ కట్ చేసి గ్రాండ్ గా జరుపుకున్నారు. ఐశ్వర్య ఫ్యామిలీలోని మూడు జెనరేషన్ మహిళలు కలిసి కేక్ కట్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Also read : Thangalaan : ‘తంగలాన్’ సినిమా కోసం మరోసారి ఆ ప్రయోగం చేసిన విక్రమ్.. ఏంటది..?
View this post on Instagram
View this post on Instagram
ఇక ఈ ఈవెంట్ లో ఐశ్వర్య కూతురు ఆరాధ్య మాట్లాడుతూ.. “అమ్మ నువ్వు చేసే సేవ కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి, ఎంతో అద్భుతమైనవి. నీ చుట్టూ ఉండే వారికీ, ప్రపంచంలోని ఇంకెంతోమంది ప్రజలకు నువ్వు చేసే సహాయం నిజంగా నమ్మశక్యం కానిది” అంటూ వ్యాఖ్యానించింది. కూతురి మాటలకూ ఐశ్వర్య ఆనందంతో పొంగిపోయింది. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్.. స్వీట్ మామ్ అండ్ డాటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram