Bigg Boss Elimination : బిగ్‌బాస్ ఎలిమినేష‌న్‌లో ట్విస్ట్‌..! మోనిత‌ సేఫ్.. మాస్ట‌ర్ ఎలిమినేట్‌..?

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో ఎనిమిదో వారం పూర్తి కావొస్తుంది. ఏడు వారాల్లో ఏడుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss Elimination : బిగ్‌బాస్ ఎలిమినేష‌న్‌లో ట్విస్ట్‌..! మోనిత‌ సేఫ్.. మాస్ట‌ర్ ఎలిమినేట్‌..?

Shobha Shetty-Aata Sandeep

Updated On : October 28, 2023 / 4:31 PM IST

Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో ఎనిమిదో వారం పూర్తి కావొస్తుంది. ఏడు వారాల్లో ఏడుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాలుగో వారంలో రతిక రోజ్‌, ఐదో వారంలో శుభ శ్రీ, ఆరో వారంలో న‌యని పావని, ఏడో వారంలో పూజా మూర్తిలు ఎలిమినేట్ అయ్యారు. వీరిలో ర‌తిక రోజ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక ఎనిమిద వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారోన‌ని అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. ఎప్ప‌టిలాగానే ఈ సారి కూడా అమ్మాయినే ఎలిమినేట్ కానుందా..? లేదంటే అబ్బాయి ఎలిమినేట్ చేస్తారా..? అన్న చ‌ర్చ న‌డుస్తోంది.

ఈ వారం నామినేషన్లలో శివాజీ, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అమర్ దీప్ చౌదరి, ఆట సందీప్, సింగర్ భోలే, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ లు ఉన్నారు. వీరిలో శివాజీకి, అమ‌ర్ ల‌కు అత్య‌ధిక ఓట్లు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. సింగ‌ర్ భోలే ఓట్ల ప‌రంగా మూడో స్థానంలో నిలిచి సేవ్ అయ్యాడ‌ట‌. అయితే.. డేంజ‌ర్ జోన్‌లో శోభాశెట్టి, అశ్విని, సందీప్ మాస్ట‌ర్ లు ఉన్నార‌ట‌. గొడ‌వ‌లు, కేక‌ల‌తో శోభాశెట్టి కంటెంట్ ఎక్కువ‌గా ఇస్తోంది. దీంతో ఆమెను బిగ్‌బాస్ కాపాడే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Kangana Ranaut : తెలిసి తెలియని వయసులో బ్రేకప్.. పెళ్లికి ఇంకా ఐదేళ్లు ఆగాల్సిందే..

వ‌రుస‌గా ఏడు వారాల్లో ఏడుగురు అమ్మాయిలే ఎలిమినేట్ కావ‌డం పై కాస్త నెగెటివిటీ వ‌చ్చింది. దీంతో అశ్విని శ్రీ ని సేవ్ చేసి సందీప్ మాస్ట‌ర్‌ను ఎలిమినేట్ చేసిన‌ట్లు లీకు వీరులు చెబుతున్నారు. మొద‌టి వారంలోనే పవర్ అస్త్ర పొంద‌డంతో ఐదు వారాలు నామినేష‌న్‌లో రాలేదు సందీప్‌. ఆరో వారంలో నామినేష‌న్స్‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ గౌత‌మ్‌కు ల‌భించిన ప‌వ‌ర్ సాయంతో అత‌డు నామినేషన్స్‌లోకి రాకుండా త‌ప్పించుకున్నాడు.

చివ‌రికి ఎనిమిదో వారంలో మొద‌టి సారి నామినేష‌న్స్‌లోకి వ‌చ్చిన సందీప్ ఈ వారం హౌస్‌ను వీడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. చూడాలి మ‌రీ సందీప్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా..? లేదంటే మ‌రొక‌రు ఎవ‌రైనా ఎలిమినేట్ అయ్యారా..? అన్న‌ది పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.