Suryapet Junction : ‘సూర్యాపేట జంక్షన్’ సినిమా రివ్యూ..
ఈ సినిమా నేడు ఏప్రిల్ 25న రిలీజయింది.

Abhimanyu Singh Suryapet Junction Movie Review
Suryapet Junction : ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘సూర్యాపేట్ జంక్షన్’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా నేడు ఏప్రిల్ 25న రిలీజయింది.
కథ విషయానికొస్తే.. స్టూడెంట్ అర్జున్ (ఈశ్వర్) తన నలుగురు స్నేహితులతో కలిసి ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. తన ఊళ్లోని జ్యోతి (నైనా సర్వర్)తో ప్రేమలో పడతాడు. నరసింహ (అభిమన్యు సింగ్) ఎమ్మెల్యే కావాలనుకుంటూ పేదల ఓట్ల కోసం ఉచితాల పథకాల పేరుతో ఓ కుట్రకు ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో అర్జున్ ఫ్రెండ్ మరణిస్తాడు. అసలు అర్జున్ ఫ్రెండ్ ని ఎవరు చంపారు? నరసింహ ఏం ప్లాన్ చేసాడు? నరసింహ – జ్యోతి ప్రేమ ఏమైంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Kaliyugam 2064 : ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ రిలీజ్.. భవిష్యత్తులో నీళ్లు, ఆహరం దొరక్కపోతే..
సినిమా విశ్లేషణ.. రెగ్యులర్ కాలేజీ స్టూడెంట్, లవ్ స్టోరీతో కథ మొదలుపెట్టినా ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలు ప్రజలకు ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తాయి అని పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. అక్కడక్కడా కామెడీ వర్కౌట్ అయింది. లవ్ స్టోరీలో కాస్త రొమాన్స్ ఎక్కువే చూపించారు. ఊళ్ళో బావి చుట్టూ తిరిగే కథ కాస్త ఆసక్తిగా ఉంటుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈశ్వర్ విలేజి కుర్రాడిగా మాస్ పాత్రలో మెప్పించాడు. నైనా సర్వర్ పల్లెటూరి అమ్మాయిగా లంగావోణీలో అందాల ఆరబోత చేస్తూనే బాగానే నటించింది. అభిమన్యు సింగ్ నెగిటివ్ షేడ్స్ లో మెప్పిస్తాడు. సంజయ్ కూడా నెగిటివ్ పాత్రలో బాగా నటించాడు. రాజేష్, సూర్య, శీను, టోనీ, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. రెగ్యులర్ స్టోరీకి పొలిటికల్ డ్రామాతో బాగానే తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా సూర్యాపేట జంక్షన్ సినిమా రాజకీయ నాయకులు ఉచితాలు ఎందుకు ఇస్తారు అని చెప్తూ కమర్షియల్ సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.