Rajamouli : వామ్మో.. మహేష్ సినిమాకు రాజమౌళి రెమ్యునరేషన్.. అన్ని వందల కోట్లా? స్టార్ హీరోల కంటే చాలా ఎక్కువ..

జక్కన్న మహేశ్ ప్రాజెక్ట్ కోసం తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

Rajamouli : వామ్మో.. మహేష్ సినిమాకు రాజమౌళి రెమ్యునరేషన్.. అన్ని వందల కోట్లా? స్టార్ హీరోల కంటే చాలా ఎక్కువ..

Rajamouli Remuneration for Mahesh Babu Movie Rumors goes Viral

Updated On : April 25, 2025 / 7:39 AM IST

Rajamouli : బాహుబలి, RRR పాన్ ఇండియా సినిమాల సక్సెస్ తో ఇండియన్ సినిమా రేంజ్ ను గ్లోబల్ ఆడియెన్స్ కు ఇంట్రడ్యూస్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. కేవలం సినిమాల సక్సెస్ లతోనే కాకుండా ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలోనూ టాప్ ప్లేస్ లో నిలుస్తున్నారు జక్కన్న. స్టార్ హీరోలను మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండియాస్ హైయెస్ట్ పెయిడ్ డైరెక్టర్ గా రికార్డ్ సృష్టిస్తున్నాడు.

జక్కన్న మహేశ్ ప్రాజెక్ట్ కోసం తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారట. ఈ సినిమాకు 200 కోట్ల రూపాయల వరకు తీసుటున్నట్లు IMDB కూడా ఓ ప్రకటనలో తెలిపింది. SSMB29 ప్రాజెక్ట్ కోసం మహేశ్ బాబు కంటే రెండింతల భారీ రెమ్యూనరేషన్ రాజమౌళి తీసుకుంటున్నారు అనే న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో రాజమౌళి రెమ్యునరేషన్ ఏకంగా 200 కోట్లా అని ఆశ్చర్యపోతున్నారు.

Also Read : Puri Jagannadh – Vijay Sethupathi : విజయ్ సేతుపతిని ‘బెగ్గర్’ చేయబోతున్న పూరి జగన్నాధ్.. ఫైనాన్స్ కష్టాలు..?

అంతేకాకుండా సినిమా ప్రాఫిట్స్ లో కూడా జక్కన్న షేర్ తీసుకునే చాన్స్ ఉందంటున్నారు. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో SSMB 29 ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా వస్తోన్న ఈ సినిమాతో రాజమౌళి మరెన్నీ రికార్డ్స్ క్రియేట్ చేస్తారోనని ఎదురు చూస్తున్నారు అభిమానులు.

తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన రాజమౌళికి కాకుండా ఇంకెవరికి ఇంత రెమ్యూనరేషన్ ఇస్తారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఆడియెన్స్. డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ విషయంలో రాజమౌళి తర్వాతి ప్లేస్ లో డైరెక్టర్ సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ ఉన్నారు. ఏదేమైన ఇటు క్రేజ్ లో అటు రెమ్యూనరేషన్ విషయంలో స్టార్ హీరోలకు మించిన క్రేజ్ తో సత్తా చాటుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి.

Also Read : Erra Cheera : సినిమా కథ గెస్ చేసి చెప్తే.. ఐదు లక్షలు ప్రైజ్ మనీ..