Puri Jagannadh – Vijay Sethupathi : విజయ్ సేతుపతిని ‘బెగ్గర్’ చేయబోతున్న పూరి జగన్నాధ్.. ఫైనాన్స్ కష్టాలు..?
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమిళ్ స్టార్ విజయ్ సేతుపతికి ఓ కథ చెప్పి ఒప్పించాడు. అధికారికంగా విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేసాడు.

Puri Jagannadh Vijay Sethupathi Movie Faces Finance Issues and Title Rumors goes Viral
Puri Jagannadh – Vijay Sethupathi : లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సినిమాలు చేయడానికి ఏ తెలుగు హీరో కూడా ముందుకు రాకపోవడంతో పూరీ ఈసారికి టాలీవుడ్ ను కాదని కోలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమిళ్ స్టార్ విజయ్ సేతుపతికి ఓ కథ చెప్పి ఒప్పించాడు. అధికారికంగా విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేసాడు. ఈ సినిమాలో టబు హీరోయిన్ గా నటించనుందని కూడా ప్రకటించారు.
అయితే పూరీతో సినిమా చేయాలంటే విజయ్ సేతుపతి ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ లోపు ఫినిష్ చేయాలనే కండీషన్ పెట్టాడని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా జూన్ నుంచి ఈ సినిమా షూట్ మొదలవ్వనుందని తెలుస్తుంది. ఓ 60 రోజుల్లోనే పూరి ఈ సినిమా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట.
Also Read : Chandrababu – Chiranjeevi : సీఎం చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోలు వైరల్..
అయితే ఈ సినిమాకి నిర్మాతలు ఎవరూ దొరక్కపోవడంతో పూరి తన సొంత నిర్మాణ సంస్థలోనే సినిమా ప్రకటించాడు. కానీ లైగర్, డబుల్ ఇస్మార్ట్ దెబ్బతో పూరీకి ఫైనాన్స్ ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రావటంలేదని టాలీవుడ్ లో వినిపిస్తుంది. దీంతో పూరీ తన సొంత బ్యానర్ లోనే సినిమా అనౌన్స్ చేసినా ఫైనాన్స్ కోసం చూస్తున్నాడట. సినిమా మొదలవ్వాలంటే ఫైనాన్స్ పరంగా కూడా సెట్ అవ్వాలని తెలుస్తుంది.
ఇక పూరి విజయ్ సేతుపతితో చేసే సినిమా టైటిల్ ‘బెగ్గర్’ అని తెలుస్తుంది. ఇందులో విజయ్ సేతుపతి బెగ్గర్ గా నటించబోతున్నాడని టాక్ విన్పిస్తోంది. మరి విజయ్ సేతుపతిని బెగ్గర్ గా చూపించి పూరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోంచి బయటపడటానికి హిట్ కొడతాడా చూడాలి. పూరి లాంటి మాస్ డైరెక్టర్ విజయ్ సేతుపతి లాంటి గ్రేట్ యాక్టర్ కలిసి సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అయితే ఉన్నాయి.
Also Read : Gopi Sundar : ఆ ఏరియాల్లో పూజించే ‘కొరగజ్జ’ దేవతపై సినిమా.. మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నాడంటే..