మెగాస్టార్ – మెగా పవర్‌స్టార్ పిక్ వైరల్..

Chiranjeevi – Ram Charan pic: ‘మగధీర’, ‘బ్రూస్ లీ’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో, శ్రీమతి సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇల్లెందులో జరుగుతోంది.. ‘ఆచార్య’ లో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ కూడా షూటింగులో పాల్గొంటున్నారు. చిరు, చరణ్ భుజంపై చెయ్యివెయ్యగా, చరణ్ పక్కకి తిరిగి చూస్తున్నారు. సిద్ధ కామ్రేడ్‌గా కనిపించనున్నాడని తెలిసేలా అతని ముందు గన్ చూపించారు. ఈ ఫొటోకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
కామ్రేడ్ సిద్ద తో ‘ఆచార్య’.. వైరల్ అవుతున్న చిరు, చరణ్ పిక్..
కాగా మరో షూటింగ్ స్పాట్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ అండ్ మెగా పవర్‌స్టార్ ఇద్దరూ ఆర్మీ దుస్తుల్లో కనిపిస్తున్న పిక్ కిరాక్ ఉంది. చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ పక్కన పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. మే 13న సినిమా భారీగా విడుదల కానుంది..