ఆచార్య: ప్రీరిలీజ్ గురించి అఫీషియల్‌గా చెప్పేసిన ఆచార్య.. ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆచార్య....

ఆచార్య: ప్రీరిలీజ్ గురించి అఫీషియల్‌గా చెప్పేసిన ఆచార్య.. ఎప్పుడంటే?

Acharya Movie Pre Release Event And Venue Fixed

Updated On : April 21, 2022 / 6:50 PM IST

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆచార్య, ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి మెగాస్టార్ తనదైన సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, పక్కా యాక్షన్ డ్రామా మూవీగా ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఆచార్య చిత్రంపై అంచనాలను పెంచేశాయి.

Acharya: ఆచార్య కోసం మహేష్ బాబు.. నిజమేనా?

ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందా అనే ప్రశ్నకు చిత్ర యూనిట్ సమాధానం ఇచ్చేశారు. ఆచార్య చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఏప్రిల్ 23న సాయంత్రం 6 గంటలకు, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ వేడుకకు దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయనతో పాటు ఇంకెవరెవరు వస్తున్నారనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Acharya Pre Release Event: అన్న కోసం తమ్ముడు.. అభిమానులకు కన్నుల పండుగ!

తొలుత ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహించాలని చూసిన ఆచార్య టీమ్, కొన్ని కారణాల వల్ల ప్లేస్‌ను మార్చాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఆచార్య కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడా లేడా అనేది మరో రెండురోజుల్లో తేలిపోతుంది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.