Anjali : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య పై న‌టి అంజ‌లి ఆస‌క్తిక‌ర పోస్ట్‌..

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవ‌ల విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.

Anjali : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య పై న‌టి అంజ‌లి ఆస‌క్తిక‌ర పోస్ట్‌..

Actor Anjali latest post goes viral on Balakrishna issue

Updated On : May 31, 2024 / 10:05 AM IST

Anjali – Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవ‌ల విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో న‌టి అంజ‌లిని బాల‌య్య తోసేశాడు అనే వీడియో వైర‌ల్ అయింది. దీంతో సోష‌ల్ మీడియాలో బాల‌య్య పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తెలుగు వాళ్లే కాకుండా వేరే భాష‌ల వాళ్లు కూడా బాల‌య్య పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఓ గొప్ప న‌టుడు అయి ఉండి ఇలా ఓ న‌టిని తోసేయ‌డం ఏంట‌ని ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే.. అస‌లు నిజం ఏంటి అనేది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిర్మాత నాగవంశీ, హీరో విశ్వక్ సేన్ ఇప్ప‌టికే దీనిపై క్లారిటీ ఇచ్చారు. స్టేజి మీద ఫోటోలకు మధ్యలో నిల్చోవాలి. దీంతో బాలయ్యను మధ్యలోకి జరగమని పక్కన వాళ్ళు చెప్పడంతో పక్కనున్న అంజలికి చెప్పారు. ఈవెంట్లో సౌండ్ కి వినపడకపోవడంతో అంజలిని పక్కకు తోశారు. అంజలి పడిపోబోవడంతో పక్కనే ఉన్న నేహా శెట్టి పట్టుకుంది. అయితే బాలయ్య నవ్వుకుంటూ సరదాగానే తోసేసాడు, అంజలి కూడా ఇది సరదాగానే తీసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ స్టేజి మీద మాట్లాడుకొని వెంటనే ఒకరికొకరు హైఫై ఇచ్చుకున్నారు.

Sriranga Neethulu : ఆహాలో దూసుకుపోతున్న సుహాస్ ‘శ్రీరంగనీతులు’.. మూడు కథలతో..

అంజ‌లి పోస్ట్‌..

నిర్మాత నాగవంశీ, హీరో విశ్వక్ సేన్ లు క్లారిటీ ఇచ్చిన‌ప్ప‌టికీ కూడా కొంద‌రు బాల‌య్య‌ను విర్శిస్తున్నారు. ఈక్ర‌మంలో న‌టి అంజ‌లి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది. తమ మధ్య ఎలాంటి బాండ్ ఉంటుందో తెలియ‌జేసింది. తామిద్దం ఎపుడు ఎంతో స్నేహంగానే ఉంటామని, ఎప్పుడూ ఒకరి పట్ల మరొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం అని అంజ‌లి తెలిపింది. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చింది.

చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజ‌రైనందుకు బాల‌య్య‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది. అంతేకాదండోయ్‌.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో వారి మధ్య కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని వీడియో రూపంగా పెట్టింది. ఇందులో బాలయ్య ఆమెతో నవ్వుతూ మాట్లాడిన సంద‌ర్భాల్లో పాటు తోసిసిన క్లిప్ కూడా ఉంది. మొత్తానికి బాల‌య్య‌తో ఆమెకు ఎలాంటి స‌మ‌స్య లేద‌ని చెప్ప‌క‌నే చెప్పింది. విమ‌ర్శ‌లు చేస్తున్న వారికి చెక్ పెట్టింది.

Kalki 2898 AD trailer : ప్రభాస్ ‘కల్కి 2898AD’ ట్రైల‌ర్ డేట్ ఫిక్స్ అయిందా??