మాటలు రావడం లేదు, నటి ఛార్మి ఇంట విషాదం

  • Published By: madhu ,Published On : July 18, 2020 / 11:48 AM IST
మాటలు రావడం లేదు, నటి ఛార్మి ఇంట విషాదం

Updated On : July 18, 2020 / 3:15 PM IST

టాలీవుడ్ లో హీరోయిన్ గా అభిమానులను అలరించిన ఛార్మి ఇంట విషాదం అలుముకుంది. ఆమె కుటుంబంలో ఒకరైన అత్త తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా ఛార్మి వెల్లడించారు.

2020, జులై 18వ తేదీ Twitter వేదికగా Tweet చేశారు. భావోద్వేగపూరిత సందేశం పోస్టు చేశారు. మీరు లేరని తెలిసి మాటలు రావడం లేదు అంటూ వెల్లడించారు.

మీరు లేరు అనే మాట వినలేకపోతున్నా…కానీ జీవితంలో జరిగేది జరగక మానదు అంటూ తెలిపారు. చివరగా వీడియో కాల్ లో అత్తతో మాట్లాడినట్లు, కానీ అదే లాస్ట్ కాల్ అవుతుందని ఊహించలేదన్నారు. మీరు లేరని తెలిసి మాటలు రావడం లేదని, స్వర్గంలో నీకు నచ్చినట్లుగా Wine తాగుతూ Enjoy చేస్తూ ఉంటావని అనుకుంటున్నట్లు విషాదవదనంతో తెలిపారు.

పైన ఉన్న అప్పితో కలిసి ఎంతూ విలువైన సమయాన్ని గడుపుతావని ఆశిస్తున్నట్లు, నిన్ను, నీ చిరునవ్వును మిస్ అవుతున్నట్లు వెల్లడించారు. నా ప్రియమైన ఆంటీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు నటి ఛార్మి పోస్టు చేశారు.