నటదిగ్గజం మోహన్ లాల్‌కు పద్మభూషణ్

  • Published By: veegamteam ,Published On : January 26, 2019 / 08:21 AM IST
నటదిగ్గజం మోహన్ లాల్‌కు పద్మభూషణ్

Updated On : January 26, 2019 / 8:21 AM IST

నటదిగ్గజం మోహన్ లాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం ఆయనను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఇటు కమర్షియల్ సినిమాలు.. అటు కళాత్మక సినిమాలు.. రెండింటిలోనూ ఆరితేరారు. తనలోని నటుడిని ఎలివేట్ చేస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగారు. రీసెంట్‌గా ‘మనమంతా’, జనతా గ్యారేజ్’ సినిమాలతో తెలగు ఆడియన్స్‌ హృదయాలను దోచుకున్నారు. సినీ పరిశ్రమలో విశేష ప్రతిభచూపిన మోహన్‌లాల్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది.

 

మోహన్ లాల్ ఇప్పటికే పద్మశ్రీ అందుకున్నారు. జాతీయ స్థాయిలో ఐదు పురస్కారాలు స్వీకరించారు. ‘భరతమ్’ ‘వానప్రస్థం’ సినిమాలకు గాను రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పురస్కారాన్ని దక్కించుకున్నారు. ‘వాన ప్రస్థం’ సినిమాకు గాను ఉత్తమ చిత్ర నిర్మాతగా నేషనల్ అవార్డు అందుకున్నారు. వీటితో జాతీయ స్థాయిలో రెండు సార్లు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం మోహన్ లాల్.. త్వరలో వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ‘మహాభారతం’లో భీముడి పాత్రలో నటిస్తున్నాడు.