Nagarjuna : సీఎం చంద్రబాబును కలిసిన సినీ నటుడు నాగార్జున..
సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు.

Actor Nagarjuna Invited AP CM Chandrababu Naidu To Akhil Akkinenis Weddin
అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ క్రమంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తన చిన్న కొడుకు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. వివాహ పత్రిక అందజేశారు.
గతేడాది నవంబర్‌లో అక్కినేని అఖిల్‌కు జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరు జూన్ 6న పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టేడియోలోనే సింపుల్‌గా జరగనున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది.
The Raja Saab : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..?
ఇక సినిమాల విషయానికి వస్తే.. అఖిల్ ‘సిసింద్రీ’ చిత్రంతోనే బాలనటుడిగా వెండితెరపై కనిపించాడు. ఆ తరువాత 2015లో ‘అఖిల్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘ఏజెంట్’ వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ‘లెనిన్’ మూవీలో నటిస్తున్నాడు. కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
Tollywood : పవన్ సారథ్యం.. టాలీవుడ్ స్టార్ హీరోల మీటింగ్?
మరోవైపు నాగార్జున కుబేర మూవీలో నటిస్తున్నారు.