Tollywood : పవన్ సారథ్యం.. టాలీవుడ్ స్టార్ హీరోల మీటింగ్?

Gossip Garage Tollywood Heroes Meeting
సినిమా మేకింగ్‌కు ఓ కష్టం. రిలీజ్ చేయాలంటే ఎన్నో అవస్థలు. తీరా విడుదల తర్వాత బాక్సాఫీస్ దగ్గర సీన్ సితార అవుతుంది. ప్రొడ్యూసర్ నష్టపోతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డుక్కుతున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయ్. అన్నీ సాల్వ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారట స్టార్ హీరోలు.
పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా కూడా చేయకపోవడం, షూటింగ్‌లలో జాప్యం, భారీ రెమ్యూనరేషన్ డిమాండ్‌లు వంటి అంశాలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు తలనొప్పిగా మారాయట. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఒకే వేదిక మీదకు రాబోతున్నారట. టాలీవుడ్ స్టార్ హీరోలు మీటింగ్‌కు, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నాయకత్వం వహరిస్తారట. స్టార్ హీరోలంతా ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయాలని, ఒక్కొక్కరూ తమ ప్రాజెక్ట్‌లను స్పీడప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు భారీ రెమ్యూనరేషన్‌లకు బదులు ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో పనిచేయాలని, దీంతో ప్రొడ్యూసర్లకు ఆర్థిక భారం తగ్గడమే కాక, సినిమాల నాణ్యతపైనా హీరోలు బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నారట.
Nitya Shetty : సినిమా ఆడిషన్స్ లో ముక్కు సర్జరీ చేసుకోమన్నారు.. లావుగా ఉన్నాను అన్నారు..
స్టార్ హీరోలు ఒకే వేదికపైకి వస్తే చాలా ప్రాబ్లమ్స్ పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారట. హీరోలు, ప్రొడ్యూసర్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే టాలీవుడ్‌లో కొత్త ఉత్సాహం వస్తుందని, మరిన్ని లోబడ్జెట్ మూవీస్‌కు అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒక కీలక సమావేశానికి హాజరకాబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ మీటింగ్‌ను పవన్ కల్యాణ్ లీడ్ చేస్తారని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీ పట్ల ఆయన చూపిస్తున్న చొరవ, ఆలోచనలు ఈ సమావేశానికి ఊపు తెస్తాయని టాక్. ఇందులో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్స్‌తో పాటు, యంగ్ హీరోలు కూడా పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే టాలీవుడ్‌లో కొత్త ఒరవడి సృష్టించే అవకాశం ఉంది. మరి ఈ మీటింగ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది.? హీరోలంతా ఈ ప్రతిపాదనలను ఒప్పుకుంటారా? అనేది చూడాలి.