Padma Soorya : సీరియల్ నటిని పెళ్లాడిన విలన్.. ఆ నటి ఎవరంటే?
తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించిన పద్మ సూర్య, సీరియల్ నటి గోపిక అనిల్ ఒకింటివారయ్యారు. కేరళ వడక్కునాథన్ ఆలయంలో జరిగిన వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Padma Soorya
Padma Soorya : చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించిన మళయాళ నటుడు పద్మ సూర్య టీవీ సీరియల్ నటి గోపిక అనిల్‌ని పెళ్లాడారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మళయాళ నటుడు పద్మ సూర్య పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. డాడీ కూల్, 72 మోడల్, ప్రేతమ్, ప్రేతమ్ 2 వంటి సినిమాలు చేశారు. అల వైకుంఠపురం సినిమాలో విలన్ కొడుకుగా నటించిన పద్మ సూర్య బంగార్రాజు, మీట్ క్యూట్, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ సినిమాల్లో విలన్ రోల్స్ చేశారు. మళయాళంలో టీవీ షోలు హోస్టింగ్ చేస్తుంటారు పద్మ సూర్య. కాగా గోపిక అనిల్ పలు సీరియల్స్‌లో నటించారు.
Kajal Aggarwal : ఫ్యామిలీతో కాజల్ అగర్వాల్ స్విట్జర్లాండ్ వెకేషన్.. ఫొటోలు..
పద్మ సూర్య, గోపిక అనిల్‌లకు గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగింది. కాగా కేరళలోని వడక్కునాథన్ ఆలయంలో ఈరోజు వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహంగా తెలుస్తోంది. పద్మ సూర్య-గోపిక అనిల్ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
View this post on Instagram
View this post on Instagram