Chandrabose : ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్‌కు ఘన సత్కారం.. తెలుగు అక్షరమాల దండతో..

ఈ కార్యక్రమమంలో చంద్రబోస్ ని తెలుగు అక్షరమాలతో చేసిన దండని వేసి, ఆయనకు పలు మెమెంటోలు అందించి సత్కరించారు. ఆయన కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన మెమెంటోలను కూడా అందించి సన్మానించారు.

Chandrabose : ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్‌కు ఘన సత్కారం.. తెలుగు అక్షరమాల దండతో..

Actor Pradeep and I Fly Station Felicitate Oscar Winner Lyricist Chandrabose

Chandrabose : RRR సినిమాలోని నాటు నాటు సాంగ్(Naatu Naatu Song) తో ఆస్కార్ తో పాటు పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ ని తాజాగా ఘనంగా సత్కరించారు. ప్రముఖ సినీ నటుడు శ్రీ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో I FLY STATION ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో కార్యక్రమం జరిగింది. చంద్రబోస్ రచించిన గీతాల గురించి వారే స్వయంగా తమ మనసులోని మాటలను తెలియజేస్తూ, ఆ పాటను ప్రముఖ గాయనీ గాయకులు గీతామాధురి, దీపు, పివిఎన్ఎస్ రోహిత్, సత్య యామిని, అతిథి భావరాజు, సాయి చరణ్ లతో పాడించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరు అయ్యారు. మురళీ మోహన్, సంగీత దర్శకురాలు శ్రీలేఖ, రచయిత రామ జోగయ్య శాస్త్రి.. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమమంలో చంద్రబోస్ ని తెలుగు అక్షరమాలతో చేసిన దండని వేసి, ఆయనకు పలు మెమెంటోలు అందించి సత్కరించారు. ఆయన కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన మెమెంటోలను కూడా అందించి సన్మానించారు.

Actor Pradeep and I Fly Station Felicitate Oscar Winner Lyricist Chandrabose

సన్మానం అనంతరం ఈ కార్యక్రమంలో చంద్రబోస్ మాట్లాడుతూ… మా అన్నయ్య నన్ను ఎంతో ప్రోత్సహించారు. అన్నయ్యకు, నాకు సపోర్ట్ గా నిలిచిన నా మిత్రులకు ధన్యవాదాలు. ప్రదీప్ గారు మీ రుణం నేను తీర్చుకోవాలి. మీకు సరస్వతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ వేదికపై ఎన్నో వందల ఆడియోలు రిలీజ్ చేశాం. ఎవరు హీరో అంటే.. పాట హీరో.. సంగీతం హీరో… సాహిత్యం హీరో. నా మొదటి పాటకు శ్రీలేఖ గారు అద్భతమైన బాణి ఇచ్చారు. అప్పుడు నేను ఇంజినీరింగ్ చదువుతున్నాను. అప్పుడు నన్ను రామానాయుడు గారు ఎంతో ప్రోత్సహించారు. 95లో మొదలైన నా ప్రయాణం… 2023 వరకు 28 సంవత్సరంలో 800 సినిమాల్లో 3600పైగా పాటలు రాశాను. నాకు నా జీవితానికి పరిపూర్ణత తీసుకువచ్చిన సంతవత్సరం 2023. మొదట గోల్డెన్ గ్లోబ్, రెండవది హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్, మూడవది క్రిటిక్స్ అవార్డ్స్, నాలుగవది ఆస్కార్, ఐదవది బాంబే హంగామా అవార్డు, ఆరవది జాతీయ పురస్కారం. ఇలా ఈ ఏడాదిలో ఆరు అవార్డుల వర్షం కురిసింది. తెలుగుకి వెయ్యి ఏళ్ల సాహిత్య చరిత్ర ఉంది. రెండువేల సంవత్సరాల భాష చరిత్ర ఉంది. తెలుగులో పుట్టాం.. తెలుగులో పెరిగాం… తెలుగులో ఎదుగుతాం, తెలుగులో బతుకుతాం, తెలుగులో చనిపోతాం. ఇక నాటు నాటు సాంగ్ రాసే అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి, కీరవాణి గారికి ఈ పాటను అలపించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ గారికి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ గారికి ధన్యవాదాలు. నాటు నాటు పాటను 45 నిమిషాల్లో రాసినప్పటికీ.. దాన్ని పూర్తి చేయడానికి ఏడాదికి పైగా పట్టింది. అంత సహనంగా ఉన్నందుకు ప్రతిఫలం దక్కింది. ప్రతి గాయకుడికి, ప్రతి దర్శకుడికి, ప్రతి సంగీత దర్శకుడికి ధన్యవాదాలు. మురళి మోహన్ గారు 83 ఏళ్ల శాశ్వత యువకులు. ఆయన హుషారుగా పాట వింటున్నారు. ఇక ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చిన శాస్త్రి గారు.. మా ఇంటి ఎదురే ఉంటారు. ఆయన రావడం గొప్ప విశేషం. మీరందరూ లేకుండే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. భార్యని అర్థంగి అంటారు. నేను అర్ధంగి అనను పూర్ణంగి అంటాను. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కారణం అయిన స్పాన్సార్స్ కు చేతులెత్తి నమస్కారం చేేస్తున్నాను అని తెలిపారు.

Actor Pradeep and I Fly Station Felicitate Oscar Winner Lyricist Chandrabose

ముఖ్య అతిథిగా విచ్చేసిన మురళీమోహన్ మాట్లాడుతూ… వేదికపై అనేక మంది పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ చూస్తే.. చివరి వరకు కూర్చోని చూడాలని అనిపిస్తుంది. చంద్రబోస్ మొట్ట మొదటి సారిగా తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకువచ్చిన మహానీయుడు. భారతీయ చిత్రసీమ ఆయన్ని చూసి గర్వపడుతుంది. ఒకే సంవత్సరంలో అస్కార్ అవార్డు.. అదే సంవత్సరంలో జాతీయ అవర్డు తీసుకువచ్చిన ఏకైక లిరిసిస్ట్ చంద్రబోస్. ఆయన గెలుపు వెనుక సతిమణి ఉన్నారు. వీరి ఆట పాట అద్భుతంగా ఉన్నారు కాబట్టి… వీరు ఆదర్శంగా ఉన్నారు. సుచిత్ర మా పక్కింటి అమ్మాయి. వాళ్ల నాన్న గారు మ్యూజిక్ డైరెక్టర్. ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్ అదర్. ఇక ఆస్కార్ అవార్డుకు వెళ్లే ముందు చంద్రబోస్ సుచిత్రను పిలిచారు. కానీ ఆమె రాను మీరు వెళ్లండని చెప్పింది. దానికి కారణం పూజ గదిలో నుంచి బయటకు రాకుండా పూజలు నిర్వహించింది.

Also Read : Sitara Ghattamaneni : సితార పాప మంచితనం.. ముసలివాళ్ళకి చేయి అందించి.. గిఫ్టులు ఇచ్చి.. నవ్వుతూ అందరితో.. వైరల్ అవుతున్న వీడియో..

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ… సభా ముఖంగా చంద్రబోస్ గారికి అభినందనలు. చాలా గర్వంగా అనిపిస్తుంది. నా మనసు ఉప్పోంగిపోతుంది. ఎవరి ప్రయాణం అయినా చిన్నగా మొదలు అవుతుంది. పెద్దగా ముగుస్తుంది. నిరంతరం నిత్య విద్యార్థిగా ఉంటూ.. చంద్రబోస్ ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన జీవితం గొప్పది. ఆదర్శం అంటూ కొనియాడారు.