Samantha : మళ్లీ ఆశ్రమం బాట పట్టిన సమంత..
స్టార్ హీరోయిన్ సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది.

Actor Samantha doing meditation in Isha Foundation
స్టార్ హీరోయిన్ సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తనకు సంబంధించిన రెగ్యులర్ అప్‌డేట్స్‌తో పాటు ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. ఆమె నటించిన సిటాడెల్ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్దంగా ఉంది. అదే సమయంలో తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే ఓ మూవీని ప్రకటించింది.
కాగా.. సమంత మళ్లీ ఆశ్రమం బాట పట్టింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కి వెళ్ళింది. అక్కడ ధ్యానం చేస్తున్న పలు ఫొటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. మనలో చాలామంది గురువు లేదా మెంటార్ కోసం వెతుకుతుంటారు. మన జీవితానికి వెలుగు చూపుతూ, సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని కనుగొడం అనేది చాలా ప్రత్యేకమైన సందర్భం అని సమంత అంది.
Son of Tsunami : ‘సన్నాఫ్ సునామి’ సినిమా ఓపెనింగ్..
జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలి. ఎందుకంటే మన రోజు వారి జీవితంలో అనేక సంఘటనలు వల్ల మనకు ఇది లభిస్తుంది. అయితే.. ఇది సులభమైనది అని మీరు ఆలోచిస్తున్నారు. కాని కానేకాదు. దీన్ని సంపాదించుకోవడం కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. జ్ఞానం పొందడంమే కాదు దాన్ని అమలు చేయడం నిజంగా ఎంతో ముఖ్యమైనది అంటూ సమంత రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత పోస్ట్ వైరల్‌గా మారింది.
View this post on Instagram