Son of Tsunami : ‘సన్నాఫ్ సునామి’ సినిమా ఓపెనింగ్..
సన్నాఫ్ సునామి సినిమా ఓపెనింగ్ లో నటీనటులపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ క్లాప్ ఇచ్చి ప్రారంభించారు.

Son of Tsunami Movie Opening By Prathani Ramakrishna Goud
Son of Tsunami Movie Opening : దిలీప్ కుమార్ రాథోడ్, అరవిందా అగర్వాల్, షణ్ణు హీరోహీరోయిన్లుగా చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సన్నాఫ్ సునామి. ఈ సినిమాకు శతృవుల గుండెల్లో దడ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. కృష్ణ ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఒకేరోజు సన్నాఫ్ సునామి తో పాటు బాల తేజం అనే మరో సినిమాని కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి మొదలుపెట్టారు.
సన్నాఫ్ సునామి సినిమా ఓపెనింగ్ లో నటీనటులపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ క్లాప్ ఇచ్చి ప్రారంభించారు. అనంతరం అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కాన్సెఫ్ట్ విన్నాను, చాలా బాగుంది. సన్నాఫ్ సునామి సినిమా దర్శక నిర్మాతలకు మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా పూర్తి సహాకారం అందిస్తామని తెలిపారు.
Also Read : Aishwarya Arjun : ఘనంగా యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు వివాహం.. ఫొటోలు వైరల్..
హీరోగా నటిస్తున్న దిలీప్ కుమార్ రాథోడ్ మాట్లాడుతూ.. ఒక ప్రొడ్యూసర్ ఒక్క సినిమా అవకాశం ఇవ్వడమే కష్టమైనా రోజుల్లో నిర్మాత కృష్ణ ప్రసాద్ నాకు నాలుగు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. సన్నాఫ్ సునామి కథ బాగుంటుంది అని తెలిపారు. నిర్మాత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. మా బ్యానర్‌లో ఇవాళ సన్నాఫ్ సునామి, బాల తేజం సినిమాలు ప్రారంభించడం ఆనందంగా ఉంది. మరో రెండు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి అని తెలిపారు.