500 మందికి అన్నం పెట్టిన హీరో..
లాక్‌డౌన్ వేళ ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆహారమందించిన హీరో శ్రీకాంత్..

లాక్‌డౌన్ వేళ ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆహారమందించిన హీరో శ్రీకాంత్..
హీరో శ్రీకాంత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్కు దగ్గర ఐదు వందల మందికి బుధవారం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్త్ మధ్య ఈ కార్యక్రమం జరిగింది. హీరో శ్రీకాంత్‌తో పాటు శ్రీమిత్ర చౌదరి, డీసీపీ ట్రాఫిక్ చౌహాన్ సహా పలువురు పోలీస్ సిబ్బంది యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్క్ ముందు ఫుడ్ ప్యాకెట్స్‌ను అందచేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘ఈ కరోనా మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసులు పర్మిషన్‌తో, వారి ఆధ్వర్యంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. పోలీసుల సహకారం మరువలేనిది.
Read Also : వెయ్యిమందికి సాయం.. అమితాబ్ ఆశ్చర్యపోయారు.. అభినందించారు..
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. ఆకలితో అలమటిస్తున్న కొంతమందికైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. లాక్‌డౌన్ ఉన్నంతకాలం నాకు చేతనైనంత వరకు నేను ఇలా సాయం చేయాలనుకుంటున్నాను. అందరూ ఇంట్లో ఉండి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి’’ అన్నారు.