Anjali Patil : సైబర్ కేటుగాళ్లకి చిక్కి లక్షలు మోసపోయిన నటి.. మరీ ఇంత అమాయకంగా
అమాయకంగా.. భయపడుతూ మాట్లాడామా? అంతే సైబర్ కేటుగాళ్లు ఈజీగా ట్రాప్‌లో పడేస్తారు. మన ఖాతాల్లోంచి లక్షలు ఖాళీ చేస్తారు. తాజాగా నటి అంజలి పాటిల్ సైబర్ నేరగాళ్ల చేతిలో లక్షల రూపాయలు మోసపోయారు.

Anjali Patil
Anjali Patil : ఇటీవల జరుగుతున్న సైబర్ మోసాల గురించి వింటున్నాం.. వీటిపై అలర్ట్ చేస్తూ అనేక ప్రకటనలు కూడా చూస్తున్నాం.. అయినా కూడా చాలామంది మోసపోతూనే ఉన్నారు. తాజాగా ప్రముఖ నటి అంజలి పాటిల్ సైబర్ నేరగాళ్ల చేతిలో లక్షలు మోసపోయారు. ఆలస్యంగా మేల్కొని పోలీసులకు కంప్లైంట్ చేసారు అంజలి పాటిల్.
అంజలి పాటిల్ తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ సినిమాల్లో నటించారు. తెలుగులో ‘నా బంగారు తల్లి’ సినిమా ద్వారా గుర్తింపు పొందారు. తాజాగా ఈ నటి సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఇటీవల అంజలికి దీపక్ శర్మ అనే వ్యక్తి ఫోన్ చేసి తనను ఫెడెక్స్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడట. తైవాన్‌లో డ్రగ్స్ పట్టుబడ్డాయని అందులో అంజలీ ఆధార్ వివరాలు ఉన్నాయని భయపెట్టాడట. దాంతో అంజలి భయపడి ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆ వ్యక్తికి చెప్పారట.
ఆ తర్వాత అంజలికి బెనర్జీ అనే వ్యక్తి నుండి స్కైప్ కాల్ వచ్చిందట. ముంబయి సైబర్ పోలీసు విభాగం నుండి ఫోన్ చేస్తున్నామంటూ సదరు వ్యక్తి చెప్పాడట. అంజలి ఆధార్ కార్డు మూడు బ్యాంకు ఖాతాలకు కనెక్ట్ అయిన మనీలాండరింగ్ కేసులో చిక్కుకుందని చెప్పాడట.. ఆమె ఈ సమస్య నుండి కాపాడాలంటే ప్రాసెసింగ్ ఫీజు క్రింద రూ.96,525 రూపాయలు చెల్లించమని డిమాండ్ చేసాడు. అక్కడితో ఆగకుండా ఇన్వెస్టిగేషన్ కోసం రూ.4,83,291 వరకు ఖర్చవుతుందని చెప్పడంతో భయపడిపోయిన అంజలి మొత్తం డబ్బును వారు పంపిన పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాతాలో జమ చేసారు.
Saindhav : వెంకీ మామ 75వ సినిమా ‘సైంధవ్’ ట్రైలర్ రిలీజ్.. మా నాన్న సూపర్ హీరో.. మాస్ ఎమోషనల్
కొన్ని రోజుల తర్వాత అంజలికి తాను మోసపోయానని గ్రహించారు. వెంటనే DN నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. సైబర్ మోసంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అపరిచితుల నుండి ఎటువంటి మెసేజ్ లు, ఫోన్ కాల్స్ వచ్చినా అలర్ట్‌గా ఉండాలని ఇటీవల కాలంలో అనేక ప్రకటనలు చూస్తున్నాం. తెలియని వ్యక్తులకు నగదు పంపే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలనే హెచ్చరికలు వింటున్నాం. చుట్టూ జరిగే ఇన్ని చూస్తూ సినిమా మాధ్యమంలో పనిచేస్తూ నటి అంజలి ఇలా అమాయకంగా మోసపోవడమేంటని అందరూ ఆశ్చర్యపోయారు.