గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : ఏకంగా 12 మందిని నామినేట్ చేసింది..

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడతకు మంచి స్పందన వస్తుంది. సినీ సెలబ్రిటీలు స్వచ్ఛందంగా పాల్గొని ఇతరులను నామినేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించారు అనుపమ పరమేశ్వరన్. మంగళవారం కేరళలోని తిరుచూరులోగల తన నివాసంలో అనుపమ పరమేశ్వరన్ ఒక మొక్కను నాటారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.
‘‘నేను గత కొన్ని రోజుల క్రితమే 25 మొక్కలు నాటాను. అందులో 23 మొక్కలు మంచిగా బతికాయి. ఇంతలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా నాకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. చాలా సంతోషంగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి ఈరోజు మా ఇంటి ఆవరణలో ఒక మొక్క నాటాను. ఇంతమంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి కృతజ్ఞతలు. ఇదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు కొనసాగాలి. అందరూ బాధ్యతగా మొక్కలు నాటాలి. నేను ఈ సందర్భంగా మరొక 12 మందిని మొక్కలు నాటాలని కోరుతూ నామినేట్ చేస్తున్నాను. కాళిదాస్ జయరామ్, నివేదా థామస్, అహనా కృష్ణ, రాజీష్ విజయన్, పద్మ శౌర్య, పిరలే మాన్య, గౌరీ కృష్ణ, గౌతమి నైరి, సిజ్జు విల్సన్, అను సితార, సితార కృష్ణ శంకర్, లక్ష్మీ ప్రియ విశాక్‌లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని అదే విధంగా ఈ చాలెంజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని’’ విజ్ఞప్తి చేశారు.