Brooke Shields : ఎక్కువ నీరు తాగడం వల్ల తనకు ఎదురైన ఆనారోగ్య పరిస్థితులు వివరించిన నటి
ఎక్కువగా నీరు తాగడం.. ఆహారంలో తక్కువ ఉప్పు వాడటం 'హైపోనాట్రేమియా' అనే ప్రాణంతక పరిస్థితికి దారి తీస్తుందట. ఇలా చేయడం వల్ల ఓ నటి ఎదుర్కున్న ఇబ్బందులు చదవండి.

Brooke Shields
Brooke Shields : అమెరికన్ నటి బ్రూక్ షీల్డ్స్ సెప్టెంబర్‌లో తను ఎదుర్కున్న భయంకర అనారోగ్య పరిస్థితిని బయటపెట్టారు. ‘గ్లామర్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ 2023’ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్కువ నీరు తాగడం వల్ల తను మూర్ఛతో ఎలా బాధపడిందో వివరించారు.
Salt Intake : అధిక ఉప్పుతో మెదడు పనితీరుపై ప్రభావం.. ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం తెలుసా ?
బ్రూక్ షీల్డ్స్ తాను అధిక మొత్తంలో మంచినీరు తాగడం వల్ల మూర్ఛ వ్యాధితో బాధపడ్డానని వెల్లడించారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం దీనిని టానిక్-క్లోనినిక్ మూర్ఛ అని పిలుస్తారట. మెదడు రెండు వైపులా ప్రభావితం చేసే ఒక రకమైన మూర్ఛ అట. దీని వల్ల శరీరంలోని కండరాలు బిగుసుకుపోవడం, వణుకు లేదా కుదుపు వంటివి జరుగుతాయట. తాను ఎక్కువ నీరు తాగడం, ఆహారంలో తగిన ఉప్పు తీసుకోకపోవడం వల్లే మూర్ఛ వచ్చిందని వైద్యులు నమ్ముతున్నట్లు బ్రూక్ షీల్డ్స్ వెల్లడించారు.
బ్రూక్ షీల్డ్స్ తీసుకునే నీటిలో సోడియం స్ధాయిలు తక్కువగా ఉన్నాయట. ఇది రక్తంలో సోడియంను నీరు కరిగించి, ‘హైపోనాట్రేమియా’ అని పిలువబడే పరిస్థితికి కారణమవుతుందట. తక్కువ స్ధాయిలో సోడియం తీసుకుంటే కణాలు ఉబ్బడంతోపాటు మెదడుపై ఒత్తిడి పెరిగి మూర్చకు కారణమవుతుందట. దీనిని ప్రాణంతాక ‘హైపోనాట్రేమియా’ గా వైద్యులు వెల్లడించినట్లు బ్రూక్ షీల్డ్స్ తెలిపారు.