Salt Intake : అధిక ఉప్పుతో మెదడు పనితీరుపై ప్రభావం.. ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం తెలుసా ?

అధిక ఉప్పు, రక్తపోటు, గుండె జబ్బులపై మాత్రమే ప్రభావం చూపుతుందని సాధారణంగా అందరికి తెలిసిందే. అయితే అది మెదడు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందన్న విషయం తాజా అధ్యయనాల్లో తేలటం అందరిని కలవర పెడుతుంది.

Salt Intake : అధిక ఉప్పుతో మెదడు పనితీరుపై ప్రభావం.. ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం తెలుసా ?

salt on brain function

Updated On : October 6, 2023 / 10:38 AM IST

Salt Intake : ఆహారపు అలవాట్లు శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. ఇటీవలి అధ్యయనాల్లో మెదడు పనితీరుపై అధిక ఉప్పు తీసుకోవడం వల్ల తీవ్రమైన ప్రభావం పడుతున్నట్లు తేలింది. భారతదేశంలో ఆహారపు అలవాట్లలో ఉప్పు అన్నది చాలా కీలకమైనది. ఉప్పు లేకుండా ఆహారపదార్ధాల తయారీ ఉండదన్నది వాస్తవం. అయితే మెదడు పనితీరుపై అధిక ఉప్పు వినియోగం అన్నది తీవ్రమైన ప్రభావం చూపుతుందన్న విషయం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం.

READ ALSO : Onion Cultivation : ఉల్లి సాగులో అధిక దిగుబడికి పాటించాల్సిన మేలైన యాజమాన్యం

భారతీయ వంటకాలు, ముఖ్యంగా వీధుల్లో ఉండే అంగళ్ళలో లభించే ఆహారాలు ,సిద్ధంగా ఉన్న స్నాక్స్ లలో అధిక మొత్తంలో సోడియంను కలిగి ఉంటాయి. అధిక మోతాదులో ఉప్పు ఉందాలేదా అన్న విషయాన్ని ఎవరు పరిశీలించరు. రుచికరంగా ఉన్నాయాలేదా మాత్రమే చూస్తారు. దీని వల్ల ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటూ చాలా మంది దీర్ఘకాలిక చిక్కులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మెదడుకు ఉప్పు కారణంగా హానికలుగుతుంది.

READ ALSO : Pests in Rice : వరిపంటను ఆశించే తెగుళ్లు.. నివారణ

మెదడు పనితీరుపై ఉప్పు ప్రభావం ;

అధిక ఉప్పు, రక్తపోటు, గుండె జబ్బులపై మాత్రమే ప్రభావం చూపుతుందని సాధారణంగా అందరికి తెలిసిందే. అయితే అది మెదడు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందన్న విషయం తాజా అధ్యయనాల్లో తేలటం అందరిని కలవర పెడుతుంది. అధిక ఉప్పును తీసుకోవటం ద్వారా జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత తగ్గడం , కాలక్రమేణా మెదడు పనితీరు క్షీణించటం వంటి సమస్యలు ఉత్పన్న అయ్యే అవకాశం ఉంటుంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల మెదడు పనితీరు తగ్గినట్లు ఇటీవలి పరిశోధన గుర్తించింది.

మెదడు పనితీరు తగ్గిపోవడానికి ప్రధాన కారణం మెదడులోని రక్తనాళాలపై ఉప్పు ప్రభావమే. మితిమీరిన ఉప్పు రక్త నాళాలు గట్టిపడటానికి కారణమవుతుంది. తద్వారా మెదడుకు రక్త ప్రసరణను తగ్గుతుంది. దీంతో జ్ఞాపకశక్తి, మతిమరుపుకు దారితీస్తుంది.

READ ALSO : Okra for Diabetes : డయాబెటిక్-ఫ్రెండ్లీ ఆహారంగా బెండకాయ ఎలా తోడ్పడుతుందంటే ?

ఉప్పు తీసుకోవడం నియంత్రించడం ;

అధిక ఉప్పు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు వంటి సమస్యలే కాకుండా మెదడు పనితీరుపై ప్రభావం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్న నేపధ్యంలో ఉప్పు తీసుకునే విషయంలో పునరాలోచించుకోవటం మంచిది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోజువారిగా తగిన మోతాదులో మాత్రమే ఉప్పు తీసుకోవాలి. ఆహారం తయారు చేసుకునే సమయంలో ఉప్పును మితంగా వినియోగించాలన్న నిర్ణయానికి రావటం మంచిది.