Pests in Rice : వరిపంటను ఆశించే తెగుళ్లు.. నివారణ

మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం వలన చాలా చోట్ల బ్యాక్టీరియా ఎండాకు తెగులు,  అగ్గితెగులు, మెడవిరుపు, పాముపుడ,  తెగుళ్లు సోకేందుకు అవకాశం ఉంది .

Pests in Rice : వరిపంటను ఆశించే తెగుళ్లు.. నివారణ

Pests in Rice

Pests in Rice : వరి వివిధ ప్రాంతాలలో పిలక దశ నుండి ఈనిక దశవరకు ఉంది. అయితే వాతావరణం మార్పుల కారణంగా చీడపీడలు ఆశించే తీవ్రంగా నష్టం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల  తెగుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని గుర్తించిన వెంటనే చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం.

READ ALSO : CM Jagan : కాపుల ఓట్లు చేజారకుండా సీఎం జగన్ మాస్టర్ ప్లాన్

ప్రస్తుతం వరి వివిధ ప్రాంతాల్లో పిలక దశ నుండి ఈనిక దశలో ఉంది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చీడపీడలు అధికంగా ఆశించే సమయం. ఇందుకు అనుగుణంగానే వాతావరణం కూడా ఉంది. వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు. దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది.

READ ALSO : పాత ఐఫోన్ టు కొత్త ఐఫోన్ డేటా మార్చాలంటే..!

ముఖ్యంగా మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం వలన చాలా చోట్ల బ్యాక్టీరియా ఎండాకు తెగులు,  అగ్గితెగులు, మెడవిరుపు, పాముపుడ,  తెగుళ్లు సోకేందుకు అవకాశం ఉంది . రైతులు వీటిని గుర్తించిన వెంటే ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా, పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం.