Hema : తల్లి కన్నుమూత.. పాపం.. వెక్కి వెక్కి ఏడుస్తున్న నటి హేమ..
పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆవిడ 80 ఏళ్ళ వయసులో మరణించారు. (Hema)
Hema
Hema : లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ్ లో అనేక సినిమాలతో పాపులారిటీ తెచ్చుకుంది హేమ. బిగ్ బాస్ లో పాల్గొని మరింత వైరల్ అయింది. ఇటీవల ఒక సంవత్సరం క్రితం రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంది అనే ఆరోపణలతో వైరల్ అవ్వడమే కాక అరెస్ట్ అయి జైలుకెళ్ళొచ్చింది.(Hema)
ఆ తర్వాత హేమ ఇకపై ఎక్కువగా సినిమాలు చేయను అని చెప్పి సినిమాలకు దూరమైంది. తాజాగా నటి హేమ తల్లి మరణించింది. గతంలో డ్రగ్స్ ఆరోపణల సమయంలో ఓ ఇంటర్వ్యూలో.. నేను జైలుకెళ్లడం చూసి మా అమ్మ తట్టుకోలేకపోయింది, అనారోగ్యానికి గురయింది అని తెలిపింది.
Also Read : Janhvi Kapoor : ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ కి డూప్.. ఈ అందాల భామ ఎవరో తెలుసా?
హేమ తల్లి పేరు కోళ్ల లక్ష్మి. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆవిడ 80 ఏళ్ళ వయసులో మరణించారు. ఆవిడ సోమవారం (నవంబర్ 17వ తేదీ) రాత్రి ఆకస్మిక మరణం చెందారు. తల్లి మరణవార్త విని హేమ స్వగ్రామం రాజోలు వెళ్లారు. తల్లి పార్థీవ దేహాన్ని చూసి హేమ బోరున విలపించింది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు వైరల్ గా మారాయి.

హేమ సోదరుడు కోళ్ల శ్రీనివాస్ వద్ద రాజోలులో తన తల్లి ఉంటుంది. హేమ తల్లి అంత్యక్రియలు నేడు నిర్వహించారు. దీంతో పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు హేమ తల్లికి నివాళులు అర్పిస్తూ ఆమెకు సంతాపం తెలియచేస్తున్నారు. ఇక హేమ తన తల్లితో దిగిన పలు పాత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
Also Read : Sundeep Kishan : స్టార్ హీరో కొడుకు.. అన్ని వద్దనుకుని నా కోసం.. సందీప్ వ్యాఖ్యలు వైరల్..
