Himaja : పోలీసులు వచ్చి చెక్ చేసి వెళ్లారు అంతే.. నేను అరెస్ట్ అవ్వలేదు.. తప్పుడు వార్తలు ప్రమోట్ చేయొద్దు..
నిన్న రాత్రి పోలీసులు హిమజ ఇంటికి వెళ్లి చెక్ చేశారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఎన్నికల కోడ్ ఉండగా హిమజ లిక్కర్ పార్టీ, రేవ్ పార్టీ చేసుకున్నందుకు అరెస్ట్ అయిందనే వార్తలు వచ్చాయి.

Actress Himaja gives Clarity on Her Arrest News
Himaja : పలు సీరియల్స్, సినిమాలు, షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి హిమజ. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కొన్ని టీవీ షోలలో అలరిస్తుంది. ఇటీవలే హిమజ కొత్త ఇల్లు కట్టుకోగా నిన్న రాత్రి పలువురు టీవీ, సినీ ప్రముఖులకు ఇంట్లో పార్టీ ఇచ్చింది. ఎవరో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో నిన్న రాత్రి పోలీసులు హిమజ ఇంటికి వెళ్లి చెక్ చేశారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఎన్నికల కోడ్ ఉండగా హిమజ లిక్కర్ పార్టీ, రేవ్ పార్టీ చేసుకున్నందుకు అరెస్ట్ అయిందనే వార్తలు వచ్చాయి.
Also Read : Kalidas Jayaram : ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్న ఆ యంగ్ హీరో
తాజాగా హిమజ దీనిపై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో హిమజ మాట్లాడుతూ.. నన్నెవ్వరూ అరెస్ట్ చేయలేదు. నేను ఇంట్లోనే ఉన్నాను. నేను అరెస్ట్ అయ్యాను అని తప్పుడు వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ వీడియో పెట్టి క్లారిటీ ఇస్తున్నాను. కొత్త ఇంట్లోకి మారినందుకు మా ఫ్రెండ్స్, కొంతమంది టీవీ, సినిమా వాళ్ళని పిలిచి మా ఇంట్లోనే పార్టీ చేసుకున్నాను. ఎవరో తప్పుగా అర్ధం చేసుకొని పోలీసులకి చెప్తే ఎన్నికల కోడ్ కాబట్టి వాళ్ళు వచ్చి చెక్ చేసి, ఇక్కడ తప్పుగా ఏం జరగట్లేదని వెళ్లిపోయారు అంతే. నేను పోలీసులకు క్లారిటీ ఇచ్చాను. కొంతమంది నేను అరెస్ట్ అయ్యానని తప్పుడు వార్తలు ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి ఫేక్ వార్తలు నమ్మకండి. అందరూ నాకు ఫోన్స్ చేస్తున్నారు. పండగ పూట ఇలా చేయడం కరెక్ట్ కాదు. సంతోషంగా ఉండాల్సిన రోజు. నేను పూజకి అన్ని ఇప్పుడే రెడీ చేసుకుంటున్నాను. దయచేసి తప్పుడు వార్తలు రాయకండి, నమ్మకండి అని తెలిపింది. దీంతో హిమజ వీడియో వైరల్ గా మారింది.