Kamakshi Bhaskarla : కెరీర్ మొదట్లోనే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్న హీరోయిన్..

14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ యాక్ట్రెస్ జ్యూరీ అవార్డు అందుకుంది నటి కామాక్షి భాస్కర్ల.

Kamakshi Bhaskarla : కెరీర్ మొదట్లోనే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్న హీరోయిన్..

Actress Kamakshi Bhaskarla Received Best Actress Jury Award from 14th Dada Saheb Phalke Film Festival

Kamakshi Bhaskarla : ఇటీవల న్యూ ఢిల్లీలో 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024 అవార్డుల కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫెస్టివల్ కి తెలుగు నుంచి పలు సినిమాలు సెలెక్ట్ అయ్యాయి. అలాగే తెలుగు నటీనటులకు, సినిమాలకు అవార్డులు కూడా చాలానే వచ్చాయి. ఈ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ యాక్ట్రెస్ జ్యూరీ అవార్డు అందుకుంది నటి కామాక్షి భాస్కర్ల.

ఇటీవల పొలిమేర, పొలిమేర 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది కామాక్షి భాస్కర్ల. డాక్టర్ చదివి అనంతరం మోడలింగ్ వైపు వచ్చి మిస్ ఇండియా తెలంగాణ గెలుచుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్, హీరోయిన్ గా దూసుకుపోతుంది. పొలిమేర సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకుంది కామాక్షి భాస్కర్ల. ఇటీవలే ఓం భీమ్ బుష్ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇచ్చి మెప్పించింది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్, క్యూట్ ఫొటోలతో అలరిస్తుంది.

Also Read : Samantha : సమంత బర్త్ డే ఏ దేశంలో చేసుకుందో తెలుసా? బర్త్ డే ట్రిప్ ఫోటోలు షేర్ చేసిన సామ్..

తాజాగా 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో పొలిమేర 2 సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ జ్యూరీ అవార్డు అందుకున్నందుకు కామాక్షి భాస్కర్ల సంతోషం వ్యక్తం చేస్తుంది. అలాగే పొలిమేర 2 సినిమా ఫెస్టివల్ స్క్రీనింగ్ లో సెలక్షన్ కూడా అవడం గమనార్హం. ఈ అవార్డు అందుకోవడంపై కామాక్షి భాస్కర్ల స్పందిస్తూ.. మా ఊరి పొలిమేర 2 లోని నా నటనకు ఉత్తమ నటిగా అవార్డు రావడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు. అవార్డులు నటిగా నా బాధ్యతను మరింత పెంచుతాయి. ఈ అవార్డు వచ్చిన సందర్భంగా సమహార థియేటర్లో నాకు నటన నేర్పించిన నా గురువుగారు రత్న శేఖర్‌, నీజర్ కబి గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు సపోర్ట్ చేసి, ఈ అవార్డు రావడానికి కారణమైన అందరికి దీన్ని అంకితమిస్తున్నాను అని తెలిపింది.

Actress Kamakshi Bhaskarla Received Best Actress Jury Award from 14th Dada Saheb Phalke Film Festival

అలాగే.. మా ఊరి పొలిమేర 2 హిట్ అవుతుందామనుకున్నాం, కానీ పెద్ద హిట్ అయింది. అవార్డులు వస్తాయనుకోలేదు. అవార్డులు కూడా వస్తున్నాయి. మా టీం అంతా కష్టపడి పనిచేసాము. చాలా సంతోషంగా ఉంది అని తెలిపింది కామాక్షి భాస్కర్ల.