Manchu Lakhsmi: మంచు వారమ్మాయా మజాకా.. ఇల్లు చూస్తే ఇంద్ర భవనమే!

పేరుకు వారసురాలిగానే ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉండాలని తపనపడే నటి మంచు లక్ష్మి. సహజంగా సినీ ఇండస్ట్రీలోని కుటుంబం నుండి కొత్తగా వచ్చే యువ నటులెవరైనా తొలి సినిమా అంటే హీరో, హీరోయిన్లుగానే అటెంప్ట్ చేస్తారు. కానీ, లక్ష్మి రావడమే నెగటివ్ రోల్ తో ఎంట్రీ ఇచ్చింది.

Manchu Lakhsmi: మంచు వారమ్మాయా మజాకా.. ఇల్లు చూస్తే ఇంద్ర భవనమే!

Manchu Lakhsmi

Updated On : August 12, 2021 / 9:13 AM IST

Manchu Lakhsmi: పేరుకు వారసురాలిగానే ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉండాలని తపనపడే నటి మంచు లక్ష్మి. సహజంగా సినీ ఇండస్ట్రీలోని కుటుంబం నుండి కొత్తగా వచ్చే యువ నటులెవరైనా తొలి సినిమా అంటే హీరో, హీరోయిన్లుగానే అటెంప్ట్ చేస్తారు. కానీ, లక్ష్మి రావడమే నెగటివ్ రోల్ తో ఎంట్రీ ఇచ్చింది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీ తొలి సినిమాతోనే నంది అవార్డు కూడా పట్టేసి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.

తొలి నుండే వైవిధ్యమైన సినిమాలను ఎంచుకొనే లక్ష్మీ నటిగానే కాకుండా నిర్మాతగా సత్తా చాటుతూనే.. బుల్లి తెరమీద కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఇక ట్రెండ్ కి తగ్గట్లే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే లక్ష్మీ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా హోమ్ టూర్ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. అందులో వంట గది, ఆఫీస్‌, తను సినిమాలు చూసే హాల్‌.. ఇలా ఇంట్లో ఉన్న ప్రత్యేక గదులన్నింటిని చూపించింది.

ఒక విధంగా మంచు వారమ్మాయి ఇల్లు ఇంద్ర భవనంగా మెరిసిపోతుంది. ఒకవైపు సంప్రదాయబద్దంగా ఉంటూనే వైట్ మార్బుల్ తో ఇల్లు తళతళలాడిపోతుంది. ముఖ్యంగా తన మేకప్‌ గది, ఆఫీస్‌ రూమ్‌, మినీ సినిమా థియేటర్‌ ఆకట్టుకోగా.. మంచు లక్ష్మి చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్‌ కలెక్షన్‌ చూస్తే అమ్మాయిలు నిజంగానే కుళ్లుకుంటారనడంలో ఎలాంటి సందేహం ఉండదేమో. ఇంత చెప్పాక ఇంకా ఆగడం ఎందుకు అంటారా.. ముందు ప్రోమో చూసేద్దాం.. ఇంకెందుకు ఆలస్యం ‘చలో మంచు లక్ష్మి ఇంటికి’..