Madhavi Latha : కృష్ణుడు వస్తానన్నాడు.. పెళ్లి మీద ఇంట్రెస్ట్ కలిగింది.. ఆ నటి ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమాలకు దూరంగా ఉన్నా నటి మాధవీ లతకి క్రేజ్ మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ నటి తన పెళ్లి గురించి రీసెంట్‌గా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Madhavi Latha : కృష్ణుడు వస్తానన్నాడు.. పెళ్లి మీద ఇంట్రెస్ట్ కలిగింది.. ఆ నటి ఆసక్తికర వ్యాఖ్యలు

Madhavi Latha

Updated On : November 9, 2023 / 12:28 PM IST

Madhavi Latha : ‘నచ్చావులే’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మాధవీ లత ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించారు. రాజకీయాల్లోను యాక్టివ్‌గా ఉంటూ సడెన్‌గా సైలెంట్ అయిపోయారు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా కనిపించే మాధవీ లత పెళ్లిపై మాత్రం చాలా ఆసక్తి నెలకొంది. తాజాగా తన పెళ్లి గురించి మాధవీ లత మీడియాకు చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

Samantha : విడాకులు, అనారోగ్యం పై సమంత వైరల్ కామెంట్స్.. వాళ్ళ వల్లే కోలుకున్నా..

మాధవీ లత నచ్చావులే, స్నేహితుడా, అరవింద్ 2 వంటి సినిమాల్లో నటించి అలరించారు. ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరం అయ్యారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పుడు అటు పెద్దగా కనిపించట్లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ ఉంటారు. తనకు నచ్చని విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పే ఈ నటి పెళ్లెప్పుడు చేసుకుంటారు? ఎవరిని చేసుకుంటారు? అనేది మాత్రం చాలామందిలో ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఈ నటి తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

మాధవీ లత కృష్ణుడిని బాగా ఆరాధిస్తారు. 2014 నుంచి కృష్ణుడు తన ఫ్రెండ్‌గా మారిపోయాడని ఆయనతో మాట్లాడుతూ ఉంటానని ఆయనతో కనెక్ట్ అయిన వారికే ఆ ప్రేమ తెలుస్తుందని చెప్పారు. 2023 లో కృష్ణుడు వస్తానని చెప్పాడని ఈ విషయం అందరికీ కామెడీ అనిపించినా అప్పటి నుండి తనకు పెళ్లంటే ఇంట్రెస్ట్ కలిగిందని చెప్పారామె. ఒకవేళ కృష్ణుడు రాకపోయినా దానికి ఏదో రీజన్ కూడా ఉంటుందని అన్నారు. అసలు పెళ్లంటే ఇంట్రెస్ట్ లేదట మాధవీ లతకి. అలాంటిది కృష్ణుడు వస్తానని చెప్పిన దగ్గర్నుంచి చాలా సంతోషంగా ఉన్నారని ఆమె చెప్పారు.

Guppedantha Manasu : అనుపమని చూసి షాకైన విశ్వనాథం.. వాళ్లిద్దరి రిలేషన్ ఏంటి?

తన పెళ్లితో పాటు సినిమాల గురించి కూడా మాధవీ లత మాట్లాడారు. తను నటనకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని హీరోయిన్ పాత్ర చేయాలని రూల్ పెట్టుకోలేదని అన్నారు.  గెస్ట్ రోల్ అయినా ఇంపార్టెన్స్ ఉన్న ఏ పాత్రలో నటించడానికి అవకాశం వచ్చిన తాను తప్పకుండా నటిస్తానని చెప్పారు.