Guppedantha Manasu : అనుపమని చూసి షాకైన విశ్వనాథం.. వాళ్లిద్దరి రిలేషన్ ఏంటి?

Guppedantha Manasu SerialToday Episode :విశ్వనాథం ఇంటికి వచ్చిన అనుపమని చూసి ఆశ్చర్యపోతాడు. ఇన్నాళ్లకు గుర్తొచ్చానా? అని ప్రశ్నిస్తాడు. అసలు వాళ్లిద్దరి మధ్యా రిలేషన్ ఏంటి?

Guppedantha Manasu : అనుపమని చూసి షాకైన విశ్వనాథం.. వాళ్లిద్దరి రిలేషన్ ఏంటి?

Guppedantha Manasu

Updated On : November 9, 2023 / 1:34 PM IST

వసుధరతో తన పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో రిషి విశ్వనాథం, ఏంజెల్‌కి చెబుతాడు. మరోవైపు తన ఇంటికి వచ్చిన అనుపమని చూసి విశ్వనాథం ఆశ్చర్యపోతాడు. వాళ్లిద్దరి రిలేషన్ ఏంటి? ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగింది?

Also,Read: యాంకర్ సుమ తాతయ్య గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు.. ఎందుకో తెలుసా..?

రిషి వసుధరతో  ప్రేమ ఎలాంటి పరిస్థితుల్లో తమ పెళ్లి జరిగిందో విశ్వనాథం, ఏంజెల్‌కి చెప్పుకొస్తాడు. ఏంజెల్ అతని మాటల్ని నమ్మనంటుంది. నమ్మి తీరాలంటుంది వసుధర. రిషితో తన ప్రేమ ఎలా పెళ్లిగా మారిందో చెబుతుంది. మీరిద్దరూ నన్ను తెలివి తక్కువ దద్దమ్మని చేశారని ఏంజెల్ రిషి, వసుధరలపై నిందలు వేస్తుంది. విశ్వనాథం కలగజేసుకుని ఏంజెల్‌కి సర్ది చెప్పి రిషి, వసుధరలు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తాడు. ఏంజెల్‌తో వసుధరకి చీర,పసుపు,కుంకుమ ఇవ్వమంటాడు. రిషి వసుధర వెళ్లగానే మేడపైనుంచి అనుపమ క్రిందకు వస్తుంది.

Guppedantha Manasu November 9th Episode

అనుపమని చూసి విశ్వనాథం షాకవుతాడు. నా మీద కోపం తగ్గి ఇన్నేళ్ల తర్వాత వచ్చావా అనుపమ అని అడుగుతాడు. ఎవరని అడిగిన ఏంజెల్‌కి మేనత్తగా పరిచయం చేస్తాడు. ఇప్పటివరకు ఎవరితో మాట్లాడుతున్నారు డాడీ అని విశ్వనాథంని అడుగుతుంది అనుపమ. తెలిసిన వారు వస్తే మాట్లాడుతున్నామని చెబుతాడు. మరోవైపు మహేంద్ర జగతి ఫోటో ముందు కూర్చుని ఆమె జ్ఞాపకాలతో కుమిలిపోతుంటాడు. అనుపమ కనిపిస్తే తప్పించుకుని తిరిగానని ఎక్కడ నీ గురించి అడిగితే నిజాలు చెప్పాల్సి వస్తుందో అని భయపడ్డానని అంటాడు. నన్ను ఎందుకు వదిలి వెళ్లిపోయావు జగతి అంటూ కన్నీరు పెట్టుకుంటాడు.mahendra crying scene

Also,Read: కమల్ హాసన్ కోసం మణిరత్నం కాపీ కొట్టారా? KH234 ఆ సినిమాకు కాపీ అంటూ ట్రోల్స్..

జగతి బ్రతికున్నప్పుడు విష్ కాలేజ్‌కి రిషి కోసం పంపిన ఉత్తరాలు బయటకు తీస్తాడు విష్ కాలేజ్ ప్రిన్సిపల్. పాండ్యన్‌ను పిలిచి వాటిని రిషికి అందించమని పంపిస్తాడు. ఇంటికి వెళ్తున్న రిషి, వసుధరలు ఏంజెల్ గురించి మాట్లాడుకుంటారు. విశ్వనాథం తమని అర్ధం చేసుకున్నారని ఏంజెల్‌కి ఇంకాస్త టైమ్ పడుతుందని రిషి అంటాడు. ఆ తర్వాత ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఎదురుచూడాల్సిందే. ఈ సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.