Ramya Krishna : తమన్నా పాటకు రమ్యకృష్ణ చిందులు.. వీడియో వైరల్
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న చిత్రం జైలర్(jailer). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా (Tamannaah) హీరోయిన్.

Ramya Krishna
Ramya Krishna-Tamannaah : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న చిత్రం జైలర్(jailer). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా (Tamannaah) హీరోయిన్. ఆగస్టు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఇటీవల ‘నువ్వు కావాలయ్యా ‘ అనే పాటను విడుదల చేసింది. ఈ సాంగ్‌లో తమన్నా వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.
ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఎక్కడ చూసినా ఈ పాట హవానే. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాటకు తాజాగా సీనియర్ నటి రమ్యకృష్ణ తనదైన స్టైల్‌లో స్టెప్పులేసింది. ఐదు పదుల వయసులోనే రమ్యకృష్ణ ఎంతో ఎనర్జీతో డ్యాన్స్ చేసింది. తన సిబ్బందితో కలిసి రమ్యకృష్ణ కావాలయ్యా పాటకు చేసిన డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇరగదీశారు.. దుమ్ములేపారు.. మేడమ్ అంటూ నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
Veera Simha Reddy : వీరసింహుని విజయోత్సవం.. ఏపీలోని ఆ థియేటర్‌లో 200 డేస్ రన్ కంప్లీట్
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న జైలర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. క కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ, సునీల్ లాంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.