రేణు రెండు కార్లు అమ్ముకుంది..

నటి రేణు దేశాయ్ తన రెండు కార్లను అమ్మేశారు. ఆమెకేవైనా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అందుకే కార్లు అమ్మేశారా? అనుకునేరు.. అలాంటిదేమీ లేదు. పవన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలలో ఆమె తనకు ఎటువంటి లోటు లేదని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఆమె తనకున్న టాలెంట్‌తో.. పిల్లల్ని బాగా చూసుకుంటూ తన పని ఏదో తను చేసుకుంటూ ఉన్నంతలో సమాజానికి సేవ చేస్తూ వెళుతున్నారు. తాజాగా తన రెండు కార్లను అమ్మేసినట్లుగా రేణు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఇంతకీ ఎందుకు అమ్మేశారు అంటే.. ఆమె కొత్తగా ఓ ఎలక్ట్రిక్ కారును కొన్నారు. ఇప్పటి వరకు తన దగ్గరున్న ఆడి ఏ6, పోర్ష్ బాక్ట్సెర్ ( Audi A6 & Porsche Boxter) కార్లను అమ్మేసి పర్యావరణానికి ఇబ్బంది కలిగించని ఎలక్ట్రిక్ కారును (Hyundai Kona) కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. అంతేకాదు అందరూ డిజిల్, పెట్రోల్‌తో నడిచే కార్లు, బైకులను ఆపేసి ఎలక్ట్రిక్ కారు వాడాలని ఆమె రిక్వెస్ట్ చేశారు.
ఎలక్ట్రిక్ కారు వల్ల పర్యావరణానికే కాదు తనకు కూడా బోలెడన్ని డబ్బులు ఆదా అవుతున్నాయని.. పెట్రోల్, డీజిల్ ఖర్చుతో పోలిస్తే కరెంట్‌కు చాలా తక్కువ మొత్తమే అవుతోందని అన్నారు. తాను చదివిన ఓ కథనం ఎంతో కదిలించిందని, అందుకే పర్యావరణంలో కార్బన్‌ను తగ్గించడం కోసమే.. ఎలక్ట్రిక్ కారు కొన్నట్లుగా తన పోస్ట్‌లో రేణు తెలిపారు. చాలామంచి నిర్ణయం తీసుకున్నారంటూ రేణే దేశాయ్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
https://www.instagram.com/p/CDvRJYfByFA/?utm_source=ig_web_copy_link