Samantha : వాళ్ళ కంటే నాకు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు.. నేను మాత్రం అలా చేయను.. సమంత సంచలన వ్యాఖ్యలు..
తాజాగా సమంత ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు మాట్లాడింది. ఈ క్రమంలో రెమ్యునరేషన్ గురించి, సినీ పరిశ్రమలో మహిళల గురించి మాట్లాడింది.

Samantha Sensational Comments on Remunerations and Women Safety in Tollywood
Samantha : కొన్నాళ్ల క్రితం సమంత ఆరోగ్య సమస్యలతో సినిమాలకు బ్రేక్ ఇస్తానని ప్రకటించింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఓ పక్క హెల్త్ చూసుకుంటూనే మరో పక్క బిజినెస్ లతో బిజీగా ఉంది. అలాగే హెల్త్ పాడ్ కాస్ట్ లు చేస్తూ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా సమంత ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు మాట్లాడింది. ఈ క్రమంలో రెమ్యునరేషన్ గురించి, సినీ పరిశ్రమలో మహిళల గురించి మాట్లాడింది.
సమంత సినీ పరిశ్రమలో మహిళల భద్రత గురించి మాట్లాడుతూ.. ఇది నా రెండో ఇల్లు లాంటిది. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. దాన్ని ఎవరో వచ్చి ఏదో చేస్తారనుకోను. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని నేనే చేస్తాను. నేను కూడా ఒక నిర్మాణ సంస్థని నడుపుతున్నాను. అక్కడ మహిళల భద్రత నా బాధ్యత అని తెలిపింది.
Also Read : Sundeep Kishan : సందీప్ కిషన్ కొత్త సిరీస్ గ్లింప్స్ చూశారా.. సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా.. బ్రహ్మానందంతో..
అలాగే రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో నాతో పాటు నటించిన నటుల కంటే కూడా నాకు తక్కువగానే రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు. నాకు అనుభవం ఉన్నప్పటికీ నాకు తక్కువగానే ఇచ్చేవాళ్ళు. ఇది నా నిర్మాణ సంస్థలో జరగకూడదు అనుకున్నాను. నేను జెండర్ ఈక్వాలిటీ చూస్తాను. మా నిర్మాణ సంస్థలో అందరికి ఒకే రకంగా చెల్లింపులు ఉంటాయి. నేను అనుభవించింది ఇంకో స్త్రీ అనుభవించకూడదు. మా సంస్థలో మగ, ఆడ వర్కర్స్ సమానంగా ఉండేలా చూస్తాను అని తెలిపింది.
అలాగే.. ఆడవాళ్లు పెళ్లయి పిల్లలు కనడం అనేది జీవితాశయం అన్న సమాజంలో మనం ఉన్నాము. నేను అక్కడి నుంచే వచ్చాను. కానీ అది తప్పు. అది జరగకపోయినా, సమాజం చెప్పినట్టు ఆ మహిళ లేకపోయినా, ఒక మహిళ తాను చేయగలిగింది చేస్తూ సంతోషంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది అని తెలిపింది.
Also Read : Game Changer : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’.. ఎప్పుడు? ఏ ఓటీటీ?
అయితే సమంత చేసిన రెమ్యునరేషన్స్ కామెంట్స్ పై మాత్రం విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా రెమ్యునరేషన్స్ అనేది ఒక యాక్టర్ కి బయట మార్కెట్ రేంజ్ ని బట్టి ఇస్తారు కానీ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని కాదు అని అందరికి తెలిసిందే. థియేటర్స్ లో హీరోలను చూసే సినిమాలకు వస్తారు. ఉదాహరణకు ఇప్పుడు ఉన్న కొంతమంది యువ హీరోలకు సీనియర్ హీరోల కంటే కూడా రెమ్యునరేషన్ ఎక్కువే ఉంది. ఎందుకంటే అది మార్కెట్ వ్యాల్యూ బట్టి ఉంటుంది. సమంత కామెంట్స్ పై సినిమా బిజినెస్ ఎవరి మీద జరుగుతుందో వారికే రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.